Tea:టీ తాగుతూ ఇవి తింటున్నారా… మీరు రిస్క్ లో పడినట్టే
Tea Benefits :రోజులో రెండుసార్లు కచ్చితంగా టీ తాగే వారు మనలో చాలా మంది ఉంటారు. ఉదయం లేవగానే ఒకసారి సాయంత్రం మరొకసారి తాగుతూ ఉంటారు. ఇలా టీ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది.కాస్త టెన్షన్ గా ఉన్నా తల నొప్పిగా ఉన్నా అలసటగా ఉన్నా టీ తాగుతూ ఉంటారు.
కొంతమంది టీ తాగుతూ ఏదో ఒకటి తింటూ ఉంటారు. బిస్కెట్లు, పకోడీలు, బజ్జీలు, కేకులు వంటివి తింటుంటారు. ఇలా కొన్ని ఆహార పదార్థాలను టీతో పాటు తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి. టీ తాగడానికి అరగంట ముందు తర్వాత ఐరన్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోకూడదు.
అలాగే టీ తాగే సమయంలో కూడా వాటిని తీసుకోకూడదు.నిమ్మకాయతో తయారు చేసిన టీ ని పరగడుపున తాగకూడదు. పాలతో తయారుచేసిన టీ తాగుతూ నిమ్మరసం తాగకూడదు. అలాగే పెరుగు కూడా అస్సలు తీసుకోకూడదు. టీ పెరుగు కలిస్తే గ్యాస్ సమస్యలు వస్తాయి. శనగపిండితో తయారు చేసిన స్నాక్స్ టీతో కలిపి తీసుకుంటే జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి.
కాబట్టి టీ తాగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. టీని లిమిట్ గా తాగితే మరియు ఏ విధంగా తాగాలో ఆ విధంగా తాగితే టీలో ఉన్న అన్నీ రకాల ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.