Garlic Water:పరగడుపున ఒక కప్పు వెల్లుల్లి నీటిని తాగితే… ఆ వ్యాధులు అన్నీదూరం
Garlic Water in telugu :వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామంది వెల్లుల్లి ఘాటుగా ఉంటుందని, వాసన వస్తుందని తినటానికి ఇష్టపడరు. అయితే వెల్లుల్లిని డైరెక్ట్ గా తినలేని వారు వెల్లుల్లి నీటిని తయారు చేసుకుని తాగవచ్చు.
వెల్లుల్లి నీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభమే. మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి నీటిలో వేసి బాగా మరిగించి వడగట్టి తాగాలి. డయాబెటిస్ లేనివారు ఈ వెల్లుల్లి నీటిలో కొంచెం తేనె కలుపుకుని తాగవచ్చు. ప్రతిరోజు వెల్లుల్లి నీటిని తాగడం వలన మెదడు పనితీరు మెరుగు పడి జ్ఞాపకశక్తి సమస్యలు ఏమి ఉండవు.
వయసు పెరిగే కొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలు ఏమీ ఉండవు. డయాబెటిస్ ఉన్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా రెగ్యులర్ గా తాగితే ఎముకలు కండరాలు దృఢంగా మారి నొప్పులు వాపులు దూరం అవుతాయి.
అంతేకాకుండా నోట్లో ఉండే బ్యాక్టీరియా నాశనం అవుతుంది. నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి రోజుకు ఒక కప్పు వెల్లుల్లి నీటిని మాత్రమే తీసుకోవాలి. .గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తాగకూడదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.