Kitchenvantalu

Chemagadda Curry :చామగడ్డ కూర ఈ విధంగా చేస్తే వదలకుండా తింటారు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Chemagadda Curry Recipe :చల్లచల్లని వాతావరణంలో వేడి వేడిగా పులుసు కూరలు చేసుకుంటే తప్పా, ముద్ద గొంతులోకి దిగదు. పులుసు కూరల్లో చామదుంపలకు తిరుగు ఉంటుందా చెప్పండి. చామగడ్డ కారం పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
ఉడికించిన చామగడ్డ – 250 గ్రాములు
నూనె – 3 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయ తరుగు – 1 కప్పు
టమాటో ముక్కలు – 1/2కప్పు
పచ్చిమిర్చి – 4
ఆవాలు – 1 టీ స్పూన్
మెంతులు – 1/4టీ స్పూన్
జీలకర్ర – 1/2టీస్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
ఎండుమిర్చి -3
పచ్చి శనగపప్పు – 1 టీ స్పూన్
దంచిన వెల్లుల్లి – 10
కరివేపాకు – 2 రెబ్బలు
ఉప్పు – తగినంత
పసుపు – 1/4టీ స్పూన్
కారం – 1.5 టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
మిరియాల పొడి – ½ టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
చింతపండు పులుసు – 150ML
నీళ్లు – 600ML

తయారీ విధానం
1.స్టవ్ పై బాండీ పెట్టుకుని, నూనె వేసి, వేడెక్కిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పపు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, వేసుకుని, ఎర్ర బడే దాకా వేపుకోవాలి.
2. ఇప్పుడు వేగిన తాళింపులో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుని, ఉల్లిపాయలు యాడ్ చేసి వేపుకోవాలి.
3. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి, టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు, వేసి, టమాటాలు ఉడికించాలి.

4. టమాటాలు మగ్గిన తర్వాత , కారం, ధనియాల పొడి, మిర్యాల పొడి వేసి, మాడిపోకుండా, కలుపుతూ చింతపండు పులుసును యాడ్ చేయాలి.
5. ఇప్పుడు చింతపండు పలుసును నూనె పైకి తేలే వరకు మరగనివ్వాలి.
6. నూనె పైకి తేలుతున్న పులుసును కొద్దిగా నీళ్లు పోసి, ఉడికించి పెట్టుకున్న చామగడ్డ ముక్కలను వేసి, మూత పెట్టి, 30 నుంచి 40 నిముషాల పాటు, ఉడికించుకోవాలి.
7. చివరగా, కొత్తిమీర తరుగు, వేసుకుని, స్టవ్ఆఫ్ చేసుకోవాలి.
Click Here To Follow Chaipakodi On Google News