Benefits of Hibiscus Tea : మందారటీని డైలీ తీసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు..
Benefits of Hibiscus Tea : మందారటీని డైలీ తీసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు..వాతావరణం మారగానే ముందుగా దగ్గు, జలుబు,గొంతు నొప్పి వంటివి సాదరణంగా చాలా మందికి వచ్చేస్తూ ఉంటాయి. వాటిని అసలు అశ్రద్ద చేయకూడదు. అలా చేస్తే అనేక సమస్యలకు కారణం కావచ్చు. అందువల్ల ప్రారంభ దశలో ఉన్నప్పుడే బయట పడటానికి మార్గాలను ఆలోచించాలి. ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.
గొంతులో తేడా ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది. దగ్గు, జలుబు కోసం ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. దగ్గు,జలుబులను అశ్రద్ద చేస్తే తలనొప్పి, ఒంటి నొప్పులు ఇలా ఒక్కొకటి వచ్చేస్తూ ఉంటాయి. ఈ రోజు ఒక టీ తయారుచేసుకుందాం.
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి రెండు మందార మొగ్గల రేకులను వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత చిన్న పటిక బెల్లం ముక్కను వేయాలి. ఒక నిమిషం అయ్యాక గ్లాస్ లోకి వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా రెండు రోజుల పాటు తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది.
మందార టీలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫ్లూ లాంటి సమస్యలు దరి చేరవు.ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామెటరీ గుణాల కారణంగా ఆయుర్వేదంలో ఇది ఎంతో విలువైన ఔషధం.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.