Kitchenvantalu

Kitchen Tips:ప్రతి ఇల్లాలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన వంటింటి చిట్కాలు

Kitchen Tips:ప్రతి ఇల్లాలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన వంటింటి చిట్కాలు..మనం సాధారణంగా ఇడ్లి పిండిని గ్రైండర్ లో రుబ్బుతూ ఉంటాం. గ్రైండర్ లో రుబ్బటం వలన పిండి బాగా పొంగి ఒదుగు వస్తుంది. కానీ గ్రైండర్ లేనివారు మిక్సీలో ఇడ్లి పిండిని రుబ్బుతూ ఉంటారు. అలాంటప్పుడు పిండి కాస్త ఒదుగు తగ్గుతుంది. మిక్సీలో రుబ్బినప్పుడు కూడా ఒదుగు బాగా వచ్చి పొంగాలంటే బాగా చల్లని నీటిని పోసి మిక్సీ చేయాలి.

వానలు వచ్చాయంటే ఈగలు వచ్చేస్తూ ఉంటాయి. మనం వండిన అన్ని వంటకాల మీద వాలుతూ చికాకును తెప్పిస్తాయి. ఈగలను వదిలించుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. అది ఏమిటంటే కొన్ని పుదీనా ఆకులను కట్ చేసి ఈగలు ఉన్న ప్రదేశంలో పెట్టాలి. పుదీనా ఘాటుకి ఈగలు పారిపోతాయి.

ఒక్కోసారి బియ్యం ఎక్కువగా కొనేస్తూ ఉంటాం. అలాంటప్పుడు బియ్యం పురుగు పడుతుంది. ఈ సమస్య చాలా మందికి ఉంటుంది. ఈ సమస్యకు సులువైన చిట్కా ఉంది. అది ఏమిటంటే వేపాకులను ఎండబెట్టి పొడి చేసి మూట కట్టి బియ్యంలో వేయాలి. వేపాకులలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండుట వలన పురుగులు బియ్యంలోకి చేరవు.

కందిపప్పు,మినపప్పు వంటి వాటికీ పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాల కింద కొన్ని వేపాకులను ఉంచితే వేప వాసనకు పురుగులు రావు.

మనం ఫ్రిడ్జ్ లో ఎన్నో రకాలను పెడుతూ ఉంటాం. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఒక రకమైన వాసన రావటాన్ని గమనిస్తాం. అయితే ఈ వాసన ఎలా పోతుందో అని కొంతమంది కంగారు పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కా పాటించండి. ఒక నిమ్మకాయను కట్ చేసి ఫ్రిడ్జ్ లో మూల పెడితే ఫ్రిడ్జ్ లో ఉన్న చెడు వాసనలను పీల్చుకుంటుంది. దాంతో ఫ్రిడ్జ్ వాసన లేకుండా ఉంటుంది.

చపాతీలను చేసి పిలల్లకు లంచ్ బాక్స్ లో పెడుతూ ఉంటాం. వాటిని పిల్లలు తినేసరికి గట్టిగా ఉండి తినటానికి చాలా కష్టంగా ఉంటుంది. చపాతీలు మెత్తగా మృదువుగా రావాలంటే చపాతీ పిండిని కలిపేటప్పుడు నీటికి బదులుగా గోరువెచ్చని పాలను ఉపయోగిస్తే చపాతీలు మెత్తగా,మృదువుగా వస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.