Healthhealth tips in telugu

Weight Loss Drink:1 గ్లాస్ తాగితే అధిక బరువు,బొడ్డు మరియు నడుము చుట్టూ కొవ్వు మంచులా కరిగిపోతుంది

Weight Loss Drink:1 గ్లాస్ తాగితే అధిక బరువు,బొడ్డు మరియు నడుము చుట్టూ కొవ్వు మంచులా కరిగిపోతుంది.. వేసవి కాలం వచ్చేసింది. ఎండలు బాగా పెరిగిపోయాయి. ఈ ఎండాకాలంలో శరీరంలో వేడిని తగ్గించి నీరసం,అలసట రాకుండా బరువును తగ్గించుకోవటానికి ఒక డ్రింక్ తయారుచేసుకుందాం.

ఈ డ్రింక్ తాగితే అధిక బరువు,శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. దీని కోసం ముందుగా ఒక స్పూన్ తులసి గింజలను నీటిలో రెండు గంటల పాటు నానబెట్టాలి.

ఒక మిక్సీ జార్ లో ఒక స్పూన్ సొంపు గింజలు, ఒక స్పూన్ పటికబెల్లం పొడి, రెండు యాలకులు వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. దీనిలో పావు స్పూన్ లో సగం నిమ్మ ఉప్పు, అరచెక్క నిమ్మరసం,ఒక గ్లాస్ నీటిని పోసి మిక్సీ చేయాలి. ఆ తర్వాత నానబెట్టి ఉంచుకున్న తులసి గింజలను వేసి ఒకసారి మిక్సీ చేసి గ్లాస్ లో పోసుకొని తాగాలి.

ఈ విధంగా 15 రోజుల పాటు తాగితే తేడా గమనించి మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సొంపు,యాలకులు,పటికబెల్లం పొడిని ఎక్కువ మొత్తంలో తయారుచేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో వేడి తగ్గటమే కాకుండా జీర్ణప్రక్రియను వేగవంతం చేసి కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.

శరీరంలో పెరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. సొంపు గింజలలో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ఈ డ్రింక్ తాగటానికి ప్రయత్నం చేయండి. కాస్త ఓపికగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.