Kitchenvantalu

Kerala Style Egg Curry:ఏమున్నా లేకున్నా సింపుల్ కేరళ స్టైల్ ఎగ్ కర్రీ ఉంటె చాలు.. Super అంటారు

Kerala Style Egg Curry Recipe: ఎగ్ కర్రీస్ ఎలా చేసినా రుచిగా ఉంటాయి. కేరళ స్టైల్లో కాస్త, ఉప్పు కారాలు తగ్గించి, కొబ్బరి పాల గ్రేవీతో, ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
కొబ్బరి నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1/2 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ – 3
పచ్చిమిర్చి – 2
టమాటో – 2
ఉప్పు – రుచికి సరిపడా
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
కారం – 1 టేబుల్ స్పూన్
గరం మసాలా – ¼ టేబుల్ స్పూన్
పల్చని కొబ్బరి పాలు – 1 కప్పు
చిక్కన కొబ్బరి పాలు – 1/2కప్పు
ఉడికించి కట్ చేసిన గుడ్లు -3

తయారీ విధానం
1.స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేడి చేసి, ఆవాలు, కరివేపాకు, వేసి, ఎర్రగా వేపుకోవాలి.
2. వేగిన తాళింపులో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మరి కాసేపు వేపుకోవాలి.
3. ఉల్లిపాయ వేగిన తర్వాత, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పేసి మెత్త పడే వరకు, మగ్గించుకోవాలి.
4. మగ్గిన టమాటోలో ధనియాల పొడి, కారం, గరం మసాలా, సోంపు పొడి, కొద్దిగా నీళ్లు వేసి, మసాలాలు వేపుకోవాలి.

5. వేగిన మాసాలాల్లో కొబ్బరి పాలు పోసి, రెండు పొంగులు రానివ్వాలి.
6. ఇప్పుడు అందులోకి ఉడికించిన గుడ్లను నెమ్మదిగా వేసి కలుపుకోవాలి.
7. చివరగా స్టవ్ ఆఫ్ చేసుకుని, చిక్కని కొబ్బరి పాలు, కొద్దిగా కరివేపాకు తరుగు వేసి, నెమ్మదిగా కలుపుకోవాలి.
8. అంతే కేరళ స్టైల్ కొబ్బరి పాలు ఎగ్ కర్రీ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News