Kitchenvantalu

Palak Pakodi Recipe:స్వీట్ షాప్ పకోడీ అంత క్రిస్పీగా ఉండడానికి సీక్రెట్ ఇదే..!

Palak Pakodi Recipe: పకోడి అనగానే చాలు, కొలతలు ఏమి లేకుండా, కావాల్సినన్ని తినేస్తాం. టైమ్ కూడా ఫాలో అవ్వకుండా, ఈవినింగ్ స్నాక్స్, లంచ్, ఏనీ టైమ్, ఏ సందర్భం లేకుండా, తినేస్తూ ఉంటాం. ఉల్లి పకోడి కాకుండా, పాలక్ తో పకోడి ఎలా చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
శనగపిండి – 200 గ్రాములు
లేత పాలకూర ఆకులు – 200 గ్రాములు
పచ్చిమిర్చి – 5
ఉప్పు – ½ టెబుల్ స్పూన్
పసుపు – ½ టెబుల్ స్పూన్
నీళ్లు – 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1/2టేబుల్ స్పూన్

తయారీ విధానం –
1.పచ్చిమర్చిని కచ్చాపచ్చాగా దంచుకుని పెట్టుకోవాలి.
2.ఒక గిన్నెలోకి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీళ్లు వేసి కలుపుకోవాలి.
3. ఇప్పుడు అందులోకి శనగపిండి, తర్వాత కడిగిన పాలకూర, నీరు లేకుండా, వేసుకుని, నెమ్మదిగా కలుపుకోవాలి.

4.ఇప్పుడు మరిగే నూనెలో కలుపుకున్న పాలకూర పిండిని, సగం పిండి, పకోడీ లాగా వేసుకుని, మీడియం ఫ్లేమ్ పై ,దోరగా రంగు మారేవరకు వేసుకోవాలి.
5. రంగు మారిన తర్వాత, హై ఫ్లేమ్ లోకి వెళ్లి, కరకరలాడే లాగా వేపుకోవాలి.
6. అంతే వేడి వేడ పాలక్ పకోడి తయార్.

Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."