Beauty Tips

Hair care Tips:బట్టతల సమస్య రాకుండా ఉండాలంటే…ఇలా చేయాల్సిందే

Hair care Tips:బట్టతల సమస్య రాకుండా ఉండాలంటే…ఇలా చేయాల్సిందే.. జుట్టు రాలే సమస్య వయస్సుతో సంబంధం లేకుండా, అలాగే ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇబ్బందికి గురి అవుతున్నారు. జుట్టు రాలి బట్టతల కాకుండానే కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు.

బిజీగా మారిన జీవనశైలి మరియు ఒత్తిడి, కాలుష్యం, రసాయనాలు వంటి కారణాలతో జుట్టు రాలిపోయి బట్టతలగా మారుతుంది. ఈ రోజుల్లో మగవారిలో చిన్న వయస్సులోనే ఈ సమస్య మొదలు అవుతుంది. కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా బట్టతల సమస్య నుండి బయట పడటమే కాకుండా బట్టతల రాకుండా కూడా నివారించవచ్చు. ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం.

1. ఒక బౌల్ లో పాలు, కుంకుమ పువ్వు తీసుకోని బాగా కలిపి తలకు రాయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే రాలిన జుట్టు మరల పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

2. నల్ల మిరియాల పొడిలో కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపి తలకు రాయాలి. ఇది బట్టతలను నివారించటంతో పాటు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మిరియాలు,నిమ్మరసంలో ఉన్న గుణాలు జుట్టు రాలకుండా నిరోదిస్తాయి.

3. కొత్తిమీర రసాన్ని ప్రతి రోజు బట్టతల మీద రాస్తూ ఉంటే కొన్ని రోజులకు జుట్టు వస్తుంది. కొత్తిమీర కూడా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సాహం ఇస్తుంది.

4. కాఫీ గింజలను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిలో కొంచెం నీరు పోసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని తలకి పట్టించి అరగంట అయ్యాక తలస్నానము చేయాలి.

5. మెంతులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేయాలి. ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే రాలిపోయిన జుట్టు తిరిగి వస్తుంది.

6. ఎండబెట్టిన కరక్కాయ ముక్కలు, తానికాయ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు పదింటిని తీసుకోని రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేయాలి. ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే రాలిపోయిన జుట్టు తిరిగి వస్తుంది.

7. మందార పూలు, గోరింటాకు, కలబంద గుజ్జులను తీసుకుని మిశ్రమంగా చేయాలి. దీన్ని నల్ల నువ్వుల నూనెలో వేసి బాగా కషాయంలా కాయాలి. దీన్ని వడబోసి తలకు రాసుకోవాలి. ఈ విధంగా చేస్తే జుట్టు బాగా పెరగడమే కాకుండా నల్లగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.