Kitchenvantalu

Bottle Gourd Curry:సొరకాయ కూర ఇలా చేసి చూడండి… ఒక ముద్ద ఎక్కువే తింటారు.. రుచి సూపర్..

Bottle Gourd Curry:సొరకాయ కూర ఇలా చేసి చూడండి… ఒక ముద్ద ఎక్కువే తింటారు.. రుచి సూపర్.. సొరకాయతో సాంబార్ , సొరకాయతో రోటి పచ్చడి టేస్ట్ చేసే ఉంటారు.

సాధారణంగా అందరు అవ్వే చేస్తుంటారు. కాని కొబ్బరిపాలతో సొరకాయ పచ్చడి చేసారంటే మీ వీక్లి మెనులో రెండు మూడు సార్లైనా ఈ పచ్చడిని యాడ్ చేస్తారు. మరి సొరకాయ కొబ్బరి పాలపచ్చడి ఎలా తయారు చెయ్యాలో చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు
సొరకాయ ముక్కలు – ½ కిలో (లేతది, తొక్కు తీసినవి)
పెరుగు- ½ కప్పు
చిక్కటి కొబ్బరి పాలు -300 ml
పచ్చిమిర్చి- 5-6
కరివేపాకు-2 రెమ్మలు
ఉప్పు-తగినంత
నూనె- 1 టేబుల్ స్పూన్
ఆవాలు- ½ టీ స్పూన్
మినపప్పు-½ టీ స్పూన్
జీలకర్ర-½ టీ స్పూన్
ఎండుమిర్చి- 2

తయారీ విధానం
1.ముందుగా ఒక బాండీలో పెరుగు వేసుకుని, ¼ లీటర్ వరకు నీళ్లు వేసుకుని, పల్చని మజ్జిగలా తయారు చేయాలి.
2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ బాండీ పెట్టుకుని, అందులోకి సొరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి , ఉప్పు, వేసి కలుపుకుని, మూత పెట్టి, మజ్జిగ ఆవిరి అయిపోయేవరకు ఉడికించాలి.

4. సొరకాయ ముక్కలు ఉడికించి, ఇప్పుడు కొబ్బరి పాలను యాడ్ చేసుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, అందులోకి జీలకర్ర , ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకుని, తయారు చేసుకున్న తాళింపును, సొరకాయ కొబ్బరి పాల కూరలో మిక్స్ చేసుకోవాలి.
5. అంతే కర్రీ రెడీ అయిపోయినట్లే!