Healthhealth tips in telugu

Coffee:కాఫీ త్రాగితే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? ఇందులో నిజం ఎంత ?

Coffee:కాఫీ త్రాగితే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? ఇందులో నిజం ఎంత.. సాదారణంగా మన ఇంటికి అతిధులు వస్తే కాఫీ తో సత్కరిస్తాము. అలాగే మనకు బోర్ కొట్టినప్పుడు ఒక కప్పు కాఫీతో దాన్ని అధికమిస్తాము. బద్దకంగా ఉండి నిద్ర వస్తుందని అనుకున్నప్పుడు ఒక కప్పు కాఫీ త్రాగి, హమ్మయ్య నిద్ర ఎగిరిపోయిందని సంతోషపడతాము. ఇలా చెప్పుకుంటూ పొతే కాఫీ త్రాగటం వలన అనేక లాభాలు ఉన్నాయి.
Black Coffee benefits
అయితే కాఫీ త్రాగటం వలన లాభాలు కంటే ఎక్కువ నష్టాలు ఉన్నాయి. ఇది రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కాఫీ ని త్రాగుతున్నారు. దీనిలో ఉండే కెఫిన్ అనే పదార్దం కేంద్ర నాడి మండల వ్యవస్థలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అందువల్ల కాఫీ త్రాగిన కొంత సేపటి వరకు ఉత్సాహంగా ఉన్న భావన కలుగుతుంది.
Black coffee beenfits
పొద్దున్నే కాఫీ త్రాగటం వలన నిద్ర మత్తు,బద్ధకం వదులుతుందని అందరూ భావిస్తారు. కానీ ఇది నమ్మకం మాత్రమే. ఇంకా దీనికి ఎటువంటి రుజువు లేదు. అయితే మందులతో కలిపి దీనిని త్రాగటం వలన మరో లాభం ఉంది. ఆ మందులోని బాధ నివారణ గుణాన్ని మరింత పెంచుతుంది.
coffee and cinnamon benefits
కాఫీలోని కెఫిన్ నరాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. కాఫీ ఎక్కువగా త్రాగటం వలన వణుకుడు,నిద్రలేమి, చికాకు తదితర సమస్యలు వస్తాయి. అయితే ఈ లక్షణాలు అన్ని అందరిలో కనిపించాలని లేదు. కాఫీ త్రాగటం అలవాటు లేని వారు ఒక్కసారిగా రోజులో ఆరు నుంచి ఎనిమిది కప్పుల కాఫీ త్రాగితే పై లక్షణాలు కనపడతాయి. కాఫీ గుండె పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
Coffee benefits in telugu
కాఫీ త్రాగటం వలన రక్తంలో కొలస్ట్రాల్ పెరుగుతుంది. రోజుకు నాలుగు కప్పుల కాఫీ త్రాగేవారిలో కొలస్ట్రాల్ పెరగటాన్ని కనుగొన్నారు. ఫిల్టర్ చేసిన కాఫీ త్రాగితే కొంత వరకు ఈ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. గర్భవతులు రోజులో తక్కువగా కాఫీ త్రాగాలి. ఎక్కువ మోతాదులో కాఫీ త్రాగటం వలన గర్భస్రావాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాఫీ త్రాగే అలవాటు ఉన్నవారు ఒక్కసారిగా మానకుండా క్రమేపి తగ్గించుకోవాలి. రోజుకి ఒక కప్పు కాఫీ త్రాగితే శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటాము. ఒక్కసారిగా కాఫీ త్రాగటం మానివేస్తే తలనొప్పి,చికాకు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.