Healthhealth tips in telugu

Joint Pains:నిమిషాల్లో కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఇలా చేస్తే సరి

Turmeric Tea Benefits In Telugu :వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు రావడం అనేది సహజమే. కానీ ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వస్తున్నాయి.ఈ నొప్పుల బాధ పడలేక చాలామంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నారు.

అయితే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. అందుకే సహజసిద్ధంగా కీళ్లనొప్పులను తగ్గించుకోవాలి. ఈరోజు ఒకమంచి చిట్కా తయారు చేసుకుందాం. ఒక గ్లాస్ నీటిని పొయ్యి మీద పెట్టి దానిలో పావు స్పూన్ పసుపు మూడు మిరియాలు పొడిగా చేసి వేసి మరిగించాలి

ఈ నీటిని వడగట్టి అరచెక్క నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ టీ ఉదయాన్నే రెగ్యులర్ గా తాగుతూ ఉంటే కీళ్ల నొప్పులు తగ్గడమే కాకుండా బరువు తగ్గుతారు అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది.

అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థ బలంగా తయారయ్యి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.