Kitchenvantalu

Pudina Tomato Chutney Recipe:పుదీనా,టమాటో పచ్చడి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేయండి.. రుచి మాత్రం అమోగం

Pudina Tomato Chutney Recipe:పుదీనా టొమాటో చట్నీ..ఇడ్లీ,దోశ,రైస్,చపాతి లోకి చాలా టేస్టీగా ఉండే చట్నీ పుదీనా టమాటో చట్నీ.పల్లీ చట్నీ బోర్ కొట్టింది అనుకుంటే దోశలోకి ఈ చట్నీ రెడీ చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది.

కావాల్సిన పదార్ధాలు
పుదీనా – 1 కప్పు
టమాటోలు – 3-4
వెల్లుల్లి రెబ్బలు – 6
పచ్చిమిర్చి – 7-8
చింతపండు – 10-15 గ్రాములు
పసుపు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
తాలింపు గింజలు – 1 టీ స్పూన్

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసి జీలకర్ర,మెంతులు,దనియాలు,పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి.
2.పచ్చిమిర్చి మగ్గాక పుదీనా ఆకువలు వేసి ఐదునిమిషాలు ఉడికించాలి.
3.అందులోకి పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
4.ఇప్పుడు అదే ప్యాన్ లో ఆయిల్ వేసి టోమాటో ముక్కలను వేసి ఉడికించాలి.

5.అందులోకి చింతపండు,వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
6.టమాటో చల్లారక మిక్సి జార్ ముందుగా పుదీనా ఆకులు వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
7.ఇప్పుడు అందులోకి టమాటో ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
8.ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసి తాలింపు గింజలు,కరివేపాకు,ఎండుమిర్చి ముక్కలు ,చిటికెడు పసుపు వేసుకోవాలి.
9.వేగిన తాలింపులోకి గ్రైండ్ చేసుకున్న పుదీనా చట్నీ వేసి కలుపుకోవాలి.అంతే పుదీనా టమాటో చట్నీ రెడీ.