Healthhealth tips in telugu

Weight Loss:కొత్తిమీరకు కొవ్వును కరిగించే శక్తి ఉందా…నమ్మలేని నిజం

Coriander Benefits In Telugu :చక్కని సువాసన,కమ్మని రుచి కలిగిన కొత్తిమీరను ఆహారపదర్దాలలో వేస్తె ఆ రుచి అదరహో అనిపిస్తుంది. అంతేకాక దీనిని తరచుగా తినటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం,మాంగనిస్, ఇనుము తగిన మోతాదులో ఉంటాయి. విటమిన్ సి,కె లు,ప్రోటిన్స్ కూడా ఉంటాయి. దీనిని తరచుగా ఆహారంలో తీసుకుంటే మన శరీరంలో ఉన్న హానికరమైన కొవ్వు కరుగుతుంది. అంతేకాక జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు అవుతుంది.

కొవ్వును కరిగించే విటమిన్స్, యాంటి ఆక్సి డెంట్స్ సమృద్దిగా ఉంటాయి. మధుమేహంతో బాధపడేవారికి మంచి మందుగా పనిచేస్తుంది. రక్తంలో చక్కర నిల్వలను సమన్వయ పరుస్తుంది.

కొత్తిమీరలో అధికంగా లభించే విటమిన్ కె వయస్సు మళ్ళిన తర్వాత వచ్చే మతిమరుపు వ్యాధి నియంత్రణలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటి ఇన్ఫ్ల మేటరి గుణాలు కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయి. కొత్తిమీరలోని యాంటి సెప్టిక్ లక్షణాలు నోటి పూతను తగ్గిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.