Kitchenvantalu

Palakura Pappu Recipe:పాలకూర పప్పు ఇలా చేయండి.. పెళ్లిభోజనం తినట్లే కమ్మగా ఉంటుంది

Palakura Pappu:పాలకూర పప్పు ఒక సూపర్ కాంబినేషన్.. తెలుగు వారు ఎంతో ఇష్టపడే వంటకం ఇది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి పాలకూర పప్పు సొంతం. పాలకూర పప్పు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు
పాలకూర – 2 కట్టలు
టమాటాలు – 2
కందిపప్పు – 1 కప్పు
శనగపప్పు -2 టెబుల్ స్పూన్స్
పచ్చిమిచ్చి – 3
మెంతులు – ¼ టీ స్పూన్
జీలకర్ర- 1/2టీ స్పూన్
చింతపండు – 10 గ్రాములు
పసుపు – 1/2టీ స్పూన్
కారం – 1/2టీ స్పూన్
కరివేపాకు – 1/4కప్పు
కొత్తిమీర – 1/4కప్పు

తాళింపు కోసం..
ఆవాలు – 1/2టీ స్పూన్
జీలకర్ర- 1/2టీ స్పూన్
ఎండుమిర్చి -3
వెల్లుల్లి రెబ్బలు -3
కరివేపాకు – 2 రెమ్మలు
నూనె – 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.ముందగా పాలకూరను శుభ్రంగా కడిగి,సన్నగా తరిగి పెట్టుకోవాలి॥.
2.ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో, కందిపప్పు, శనగపప్పు, వేసి, రెండు కప్పుల నీళ్లు యాడ్ చేసుకోవాలి.
3.అందులోకి పచ్చిమిర్చి, మెంతులు, జీలకర్ర, పసుపు, చింతపండు, టమాటో ముక్కులు వేస, 3 నుంచి 4 విజిల్స్ రావనివ్వాలి.
4. ఉడికిన తర్వాత ప్రెజర్ పోయాక వేడిగా, ఉన్నపప్పులో పాలకూరను యాడ్ చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి , పప్పు, పాలకూర మిశ్రమాన్ని, రెండు మూడు నిముషాలు ఉడికించాలి.

6.అందులోకి , కారం, ఉప్పు, వేసి, కలుపుకోవాలి.
7.అవసరం అయినంత నీటిని కలుపుకుని, పప్పును సిద్ధం చేసుకోవాలి.
8. ఉడుకుతున్న పప్పులోకి, కొత్తిమీర, కరివేపాకు వేసి, కాసేపు ఉడకనివ్వాలి.
9.ఇప్పుడు తాళింపు కోసం, పాన్ లో నూనె వేడి చేసి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి, వేగిన తాళింపును, పప్పులోకి కలపుకోవాలి.
10.అంతే పప్పు, పాలకూర తయార్.