Kitchenvantalu

Pindi Charu Recipe:ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా చారుని చేసుకోండి

Besan Flour Sambar Recipe:అన్నం, ఉప్మా, టిఫిన్స్ లోకి, జారుగా తయారు చేసుకున్న, శనగపిండి చారు సూపర్ కాంబో, శనగపిండి చారును ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయలు – 2
టమాటాలు – 3
పచ్చిమిర్చి – 3
చింతపండు – 20 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
ఆవాలు – 1 టీ స్పన్
జీలకర్ర – 1/2టీ స్పూన్
పసుపు – 1/2టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
కొత్తిమీర – 1/4కప్పు
సాంబార్ పొడి – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత

తయారీ విధానం
1.స్టౌ పై పాన్ పెట్టుకుని, హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, అందులోకి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వేసి వేపుకోవాలి.
2.అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి మెత్తపడనివ్వావి.
3.ఇప్పుడు అందులోకి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి, ఒక నిముషం పాటు వేయించుకోవాలి.
4. ఉల్లిపాయలు మెత్తపడిన తర్వాత టమాటాలను యాడ్ చేసి మగ్గనివ్వాలి.

5.మగ్గిన టమాటాల్లో కారం, ఉప్పు, చింతపండు, రసం, వేసి నాలుగు నిముషాలు మరగనివ్వాలి.
6. వేరొక గిన్నెలో శనగపిండి, రెండు కప్పుల నీళ్లతో ముద్దలు లేకుండా కలుపుకుని, మరుగుతున్న చారులో నిదానంగా కలుపుకోవాలి.
7.ఇప్పుడు శనగచారులో సాంబార్ పొడి వేసి మరి కాసేపు మరిగించుకోవాలి.
8. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.