Kitchenvantalu

Tomato Menthi Kura Vadiyalu:బియ్యం ఇంకా టమోటాతో కరకరలాడే పిండి వడియాలు

Tomato Menthi Kura Vadiyalu: పప్పు , చారు, అన్నం ఏదైనా సరే,పక్కన వడియాలు ఉంటే, ఇష్టంగా లాగించేస్తారు. రెగ్యులర్ గా తినే వడియాలు కాకుండా, టమాటో మెంతికూర వడియాలు చేసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం – 2 కప్పులు
టామాటాలు – ½ కేజీ
మెంతి ఆకులు – 5 కట్టలు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
నువ్వులు – 4 టేబుల్ స్పూన్స్
ఉప్పు – తగినంత

తయారీ విధానం
1.ఒక పాన్ లో ఒక కప్పు బియ్యానికి, మూడు కప్పుల నీటిని వేడి చేయాలి.
2. రెండు కప్పుల బియ్యానికి , ఆరు కప్పుల నీటిని తీసుకుని,మరిగించాలి.
3.మరుగుతున్న నీళ్లలో టమాటాలు వేసుకోవాలి.
4.టమాటాలు మరుగుతున్నప్పుడు మెంతి ఆకులను కూడా వేసుకుని, కొత్తిమీర కూడా వేసుకుని,బాగా ఉడికించాలి.
5.ఉడుకుతున్న టమాటాల్లోకి కడిగి నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి.
6.ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి లేదా కారం, ఉప్పు, వేసి, కలిపి, మూత పెట్టుకుని, మీడియం ఫ్లేమ్ పై,ఉడికించాలి

7.అన్నం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని, ఉడికిన అన్నాన్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి.
8. ఇప్పుడు అన్నంలోకి జీలకర్ర, నువ్వులు, వేసి, చేతులను నీటితో తడుపుకుని, పిండిని చిన్న చిన్న బంతులుగా చుట్టుకోవాలి.
9. తయారు చేసుకున్న బాల్స్ అన్నిటిని కాటన్ క్లాత్, లేదా క్లీన్ కవర్ పైన, నొక్కి పెట్టుకోవాలి.
10.తయారు చేసుకున్న వడియాలను రెండు రోజుల పాటు ఎండలో ఆర పెట్టుకోవాలి.
11. రెండు రోజుల తర్వాత కొద్దిగా నీటిని చల్లుకుని, వడియాలను క్లాత్ నుంచి వేరు చేయాలి.
12. వేరు చేసుకున్న వడియాలను మరో రెండు రోజులు ఎండ నివ్వాలి.
13. అంతే టమాటోమెంతికూర వడియాలు కావాల్సినప్పుడు నూనెలో వేయించుకోవడమే.