Healthhealth tips in telugu

Virasana:ఏ పని మీద ఏకాగ్రత ఉండటం లేదా …. అయితే ఈ ఆసనం వేయండి

Virasana:మన జీవితంలో ప్రతి రోజు ఎన్నో సమస్యల మధ్య మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించటానికి యోగా సహాయపడుతుంది. ఆసనాలలో చాలా ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచే వీరాసనం గురించి తెలుసుకుందాం.

కుడి మోకాలిని లేవనెత్తి కుడి పాదాన్ని నేలకు తాకించి, ఎడమ మోకాలి పక్కన ఉంచవలెను. కుడి మోచేతిని కుడి మోకాలు మీద పెట్టి కుడి అరచేతితో చూబుకాన్ని పట్టుకోవాలయును. కళ్ళు మూసుకుని రిలాక్స్‌గా ఉండవలెను. వెన్నెముక తల నిటారుగా ఉంచి దేహము చలన శరీరం కదలకుండా ఉంచవలెను.

అదే విధముగా ఎడమ పాదం కుడి మోకాలి పక్కన ఉంచి ఇదే ప్రకారముగా తిరిగి చేయవలెను. ఈ ఆసనము కుడి ఎడమలు మార్చుతూ సుమారు రెండు నిమిషాల పాటు చేయవలెను.

ఈ ఆసనం చేయడం వలన మనసులో సమతుల్యత ఏర్పడి ఏకాగ్రత చేసుకుంటుంది. మానశిక ప్రశాంతత ఏర్పడడంతో పరిస్థితులపై అవగాహన పెరిగి భౌతిక, మానసిక సమతుల్యత ఏర్పడగలదు.

సరైన రీతిలో ఆలోచనలు వస్తాయి.ఎప్పడూ ఆలోచిస్తూ ఉండేవారికి ఈ ఆసనము చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా మూత్ర పిండాలకు, కాలేయం, ఉధర భాగమునకు ప్రత్యుత్పత్తి అవయవములకు సంబంధించిన లోపాలను తొలగించటంలో సహాయపడుతుంది

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.