Healthhealth tips in telugu

Blood Increase Foods:రక్తంలో రక్తకణాలను పెంచి రక్త ప్రసరణను పెంచే అద్భుతమైన ఆహారాలు

Blood Increase Foods::మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రక్తకణాల పాత్ర ప్రముఖమైనది. రక్తంలో రక్త కణాల సంఖ్య తగ్గితే రక్తహీనత ఏర్పడుతుంది. రక్త హీనత అనగానే డాక్టర్స్ మందులు, టానిక్ లు ఇస్తూ ఉంటారు. వాటితో పాటు కొన్ని రకాల ఆహారాలను తింటే రక్తంలో రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

పచ్చని ఆకుకూరలు
తోటకూర,గోంగూర,బచ్చలి కూర,బ్రకోలి వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటిని ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే రక్తంలో రక్తకణాల సంఖ్య పెరగటమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. అంతేకాక రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది.

బీట్ రూట్
బీట్ రూట్ లో ఐరన్, ప్రొటీన్ సమృద్ధిగా ఉండుట వలన రక్తాన్ని శుభ్రం చేయటమే కాకుండా రక్తంలో రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. అంతేకాక బీట్ రూట్ ఆకులలో విటమిన్ ఏ,సి అధికంగా ఉండుట వలన రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.

ఐరన్
శరీరానికి ఐరన్ చాలా అవసరం. ఎముకలను గట్టిపరచటమే కాకుండా ఆక్సిజన్ సరఫరాలో బాగా సహాయపడుతుంది. ఐరన్ లోపం కారణంగా రక్తహీనత సమస్య వస్తుంది. మెంతులు, ఖర్చూరం, బాదం, బంగాళదుంప వంటి వాటిని రెగ్యులర్ గా తింటూ ఉండాలి.

బాదంపప్పులు
ఐరన్ పుష్కలంగా వుంటుంది. ప్రతిరోజూ ఒక ఔన్సు తీసుకుంటే రోజులో అవసరమైన 6 శాతం ఐరన్ ఇస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.