Healthhealth tips in telugu

Utthanapadasana:ఎసిడిటి,గ్యాస్ సమస్యలను తరిమికొట్టే…ఉత్థాన పాదాసనం

Utthanapadasana:ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరు ఒత్తిడికి గురి అవుతున్నారు. ఈ ఒత్తిడి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.

అలాగే సరైన సమయంలో భోజనం చేయక పోవటం, మసాలా ఆహారాలను తరచుగా తినటం,ఫాస్ట్ ఫుడ్స్ తినటం వంటి కారణాలతో అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా ఉత్పన్నం అవుతున్నాయి.

ఈ సమస్యలు రాగానే చాలా మంది ఇంగ్లిష్ మాత్రలు వేసుకుంటారు. అయితే ఇప్పుడు చెప్పే ఉత్థాన పాదాసనం వేస్తె ఈ సమస్యల నుండి సులభంగా బయట పడవచ్చు.

ఉత్థాన పాదాసనం ఎలా వేయాలి:

ఒక చాపపై వెల్లకిలా పడుకోవాలి.
పల్చటి దిండుపై తల ఆన్చాలి.
కాళ్లను నిటారుగా నేల బారుగా చాచాలి.
మొదట ఒక కాలిని ఎత్తి ఆ తర్వాత రెండో కాలినీ ఎత్తుతూ క్రమంగా రెండు కాళ్లనూ ఎత్తాలి.

ఇలా చేసినపుడు నడుము నేలకు తగులుతూ ఉండటంతోపాటు కాళ్లు నిటారుగా ఉండాలి. అరచేతులు నేలకు ఆనించాలి. ఈ స్థితిలో 10 సెకన్ల పాటు మామూలు శ్వాస క్రియ జరపాలి.నిశ్వాసక్రియ జరుపుతూ కాళ్లను నెమ్మదిగా నేలకు ఆన్చాలి. యథాస్థితికి రావాలి.

ఉపయోగాలు:
జీర్ణాశయంలో ఆమ్లత్వం తగ్గుతుంది. పొత్తికడుపుకు సంబంధించిన రోగాలు నివారణ అవుతాయి.మలబద్ధకం కూడా నివారించబడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.