Healthhealth tips in telugu

Diabetes:తీయని శత్రువుకి ఎలా చెక్ పెట్టాలో…. చూద్దామా?

Diabetes:బిజీ జీవనశైలి. మారిన ఆహారపు అలవాట్లు కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా మధుమేహం వ్యాధి అందరికి వచ్చేస్తుంది. కొన్ని జాగ్రత్తలను పాటిస్తే ఈ వ్యాధి బారి నుండి సురక్షితంగా ఉండవచ్చు. మధుమేహం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మధుమేహ వ్యాధి పాదాలు,కిడ్నీలు, గుండె, నరాల మీద ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రోజు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి. ముఖ్యంగా బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహ వ్యాధి ఉన్నవారు చెప్పులు లేకుండా బయటకు వెళ్ళకూడదు. ప్రతి రోజు పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. గోర్లు తీసే సమయంలో చిగురుకు గాయం కాకుండా చూసుకోవాలి. మధుమేహ తీవ్రత ఎక్కువగా ఉన్నవారు రక్తపోటు,కొలెస్ట్రాల్‌,కంటి పరీక్షలు రెగ్యులర్ గా చేయించుకోవాలి. ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండే ఆకుకూరలను తీసుకోవాలి. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. సరైన సమయానికి ఆహారం,మందులు తప్పనిసరిగా తీసుకోవాలి. 
మధుమేహ రోగులలో గుండె రక్తనాళాలు మూసుకుపోయే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏ మాత్రం గుండె నొప్పి అనిపించినా అన్ని పరీక్షలు చేయించుకోవటం మంచిది. 
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.