Healthhealth tips in telugu

Diabetes Food:డ‌యాబెటిస్ ఉందా.. అయితే వీటిని తినండి?

Diabetes Food:చాలా మందికి బీన్స్‌ని తినడమంటే ఇష్టముండదు కానీ ఈ బీన్స్‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు నిక్షిప్తమై ఉంటాయి. దీనిలో ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. మన డైలీ లైఫ్ లో వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

ఇంకా చెప్పాలంటే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న వారు రోజూ బీన్స్‌ను తింటే వారి షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయ‌ని సైంటిస్టులు తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్లడించారు.

ఈ బీన్స్‌లో మన జీర్ణ శక్తికి ఎంతో ముఖ్యమైన ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. కాబట్టి ఇది ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిల‌ను నియంత్రిస్తుంది. అందువ‌ల్లే బీన్స్‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు.

అంతేకాదు.. బీన్స్ తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌ల‌తోపాటు అధిక బ‌రువును కూడా తగ్గించుకోవ‌చ్చ‌ని వారు అంటున్నారు. అయితే బీన్స్‌ను ఉడ‌కబెట్టుకుని తిన‌డం శ్రేయ‌స్క‌రం. ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని ఫ్రై చేసుకుని తిన‌రాదు. ఉడికించి తింటేనే పైన చెప్పిన లాభాలు క‌లుగుతాయి..!

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.