MoviesTollywood news in telugu

Tollywood:అమ్మోరులో నటించిన ఈ పాప ఇప్పుడు YOUTUBE లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని మీకు తెలుసా?

sunayana Unknown Facts:అమ్మోరు మూవీ గుర్తుంది కదా. సౌందర్యను ఓవర్ నైట్ స్టార్ ని చేసిన ఈ మూవీ లో మరో కీలక పాత్ర వుంది. అదే ఆ సినిమాలో అమ్మోరుగా నటించిన అమ్మాయిని ఎవ్వరూ అంత తేలిగ్గా మరిచిపోలేరు. చారెడేసి కళ్ళతో అమ్మోరంటే ఇలాగే ఉంటుంది అన్నట్లు తెర మీద చూసిన వెంటనే అందరిచేత దండాలు పెట్టించుకున్న ఆ పాప పేరు బేబీ సునయన.

బాలనటిగా ఆమె ఓ సెలబ్రిటీ అయింది. ఆ తర్వాత క్రమంగా సినిమాలకు దూరమై, పెరిగి పెద్దదైన ఆమె ఇప్పుడు అద్భుతాలతో సంచలనాలు సృష్టిస్తోంది. సునయన విజయవాడకు చెందింది. ఆమెకు ఓ అక్కయ్య, ఓ అన్నయ్య ఉన్నారు. అందరి కన్నా చిన్న దైన సునయన ను అందరూ అందరూ అల్లారుముద్దుగా పెంచుకున్నారు.

తండ్రి అప్పట్లో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసేవారు. ఆ తర్వాత మెరుగైన ఉపాధిని వెతుక్కుని ఆర్కిటెక్ట్ గా వర్క్ చేస్తున్నారు. ఇక ఆమె తల్లి కళాకారిణి కావడంతో సునయనను క్లాసికల్ డాన్స్ స్కూల్ లో చేర్పించారు. ఇక అదే సమయంలో ఉషా కిరణ్ మూవీస్ వారు మనసు మమత మూవీ తీస్తూ అందులో ప్రతిభావంతమైన బాలనటి కోసం అన్వేషిస్తున్నారు.

ఇక స్కూల్ లో డాన్స్ చేస్తున్న సునయన ను చూసి సినిమాల్లో ఆఫర్ ఇచ్చారు. ఆ సినిమాలో నరేష్ , సితార కూతురుగా ఆమె అత్యద్భుత నటన కనబరిచింది. ఆతర్వాత పలు చిత్రాల్లో బాలనటిగా ఛాన్సులు కొట్టింది. అయితే అమ్మోరు చిత్రంతో ఊహించని బ్రేక్ లభించింది. అయితే ఆమె రెండవ సంవత్సరంలో ఉండగా మొదలుపెట్టిన ఆ సినిమా 5వ తరగతికి వచ్చేసరికి పూర్తవ్వడం విశేషం. ఇక టెన్త్ క్లాస్ కి వచ్చేసరికి వయస్సుకి తగ్గ బరువు పెరగడం వలన సినిమాలకు దూరమైంది.

అయితే టెలివిజన్ రంగం సునయన ను అక్కునచేర్చుకుని ఛాన్స్ లు ఇచ్చింది. ఈటివి, దూరదర్శన్ లలో ఆమె అనేక సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఓ పక్క సీరియల్స్ చేస్తూ, మరోపక్క డిగ్రీ పూర్తి చేసిన ఆమె తనకు ఇష్టమైన ఎంబీఏ పూర్తి చేసింది. అయితే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుండగానే, ఎంబీఏ లో తనకన్నా సీనియర్ తో పెళ్లి అయింది.

ఇక భర్త ప్రోత్సాహంతో రెడ్ ఎఫ్ ఎం రేడియో ఛానల్ లో కొత్త అవతారం ఎత్తిన సునయన అక్కడ ఎడ్జెస్ట్ కాలేక, తెల్సున్న అమ్మాయి ద్వారా వెబ్ సీరియల్స్ గురించి తెల్సుకుంది. ఆ విధంగా తన మనసులోని ఆలోచనలను,సమాజంలోని మహిళల సమస్యలను క్రోడీకరించి ఫ్రెష్టేటేడ్ వుమెన్ అనే వెబ్ సిరీస్ కి ప్రాణం పోసింది. ఆమె సృష్టించిన వీడియాలు యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి.

భార్య, తల్లి, ఉద్యోగిని,ఇలా సమాజంలో మహిళలు ఎన్నోరకాల పాత్రలు పోషిస్తూ ఉంటారు. అయితే పరిస్థితుల ప్రభావం వలన తమలోని ఫ్రెష్టే షేన్ ఎలా వ్యక్తం చేస్తారనే ఇతి వృత్తంతో ఆమె వీడియోలు రూపొందించబడ్డాయి. తానే స్క్రిప్ట్ రాసుకుని సింగిల్ టేక్ లో ఒకే అయ్యేలా తానే వీడియోలు రూపొందించే సునయన గర్భవతిగా కూడా పలు వీడియోలు చేసింది.