Athadu:అతడు’ సినిమాలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్… ఇప్పుడు బుల్లి తెరను ఒక ఊపు ఊపుతున్న టాప్ హీరోయిన్ అని మీకు తెలుసా?
Athadu Child Artist:సినీలోకం అంటే అదో వింత ప్రపంచం. అదో మాయలోకం. అందుకే తెరమీద కనిపించాలని ఎందరో కలలు కంటూ, వాటిని సాకారం చేసుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే కొందరిని అదృష్టం వరించి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసే ఛాన్స్ దక్కేలా చేస్తుంది. ఇక మరికొందరు అవకాశాలు రాకపోవడంతో వెయిటింగ్ లిస్ట్ లో ఉండిపోతారు.
ఇదిగో ఆలాంటి వారికోసం టెలివిజన్ రంగం ఆశాదీపం అవుతోంది. అప్పుడూ, ఇప్పుడూ, మరెప్పటికీ బుల్లితెర కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు దూసుకువెళ్తూనే వుంది. ముఖ్యంగా పలు టీవీలలో వచ్చే సీరియల్స్ ఎందరికో ఛాన్సులు కల్పిస్తున్నాయి. ఆవిధంగా ఓ సీరియల్ లో హీరోయిన్ గా నటించి, బుల్లితెర రంగాన్ని ఓ ఊపు ఊపేసిన ఓ నటి గురించి తెలుసుకుందాం.
ఎందుకంటే ఆ సీరియల్ అప్పట్లో టిఆర్పి రేటింగ్ లో హయ్యస్ట్ అయింది.ఇక ఆసీరియల్ లో నటించి మెప్పించిన హీరోయిన్ ఎవరంటే మౌనిక. ఈమె ఎవరంటే మా టివిలో 2006లో వచ్చిన రాధ మధు సీరియల్ లో నటించిన రాధే. హైదరాబాద్ కి చెందిన మౌనికకు చిన్ననాటినుంచి సినిమా రంగం అంటే మక్కువ కావడంతో చిన్నప్పటి నుంచి అందుకోసం కలలు కంది.
ఇక ఆమె 10వ తరగతి చదివే రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మహేష్ బాబు, త్రిష జంటగా తీసిన అతడు మూవీకోసం జరిగిన ఆడిషన్స్ లో ఎంపికై,అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసింది.
ఆతర్వాత ‘ఒక ఊరిలో’, చుక్కల్లో చంద్రుడు’, అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘స్టాలిన్’,పవన్ కళ్యాణ్ నటించిన ‘అన్నవరం’ ఆతర్వాత ‘జోష్’, ‘విజయరామరాజు. ఇటీవల వచ్చిన నాని ‘నినుకోరి’సినిమాల వరకు చిన్న చిన్న పాత్రలలో నటించింది. చుక్కల్లో చంద్రుడు మూవీ చేస్తున్నప్పుడు రాధ మధు సీరియల్ లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.
ప్రతి ఒక్కరూ ఈమెను తమ ఇంట్లో మనిషిగా భావించి, ఆ సీరియల్ వస్తుంటే, అదిగో మధు అని పిలుచుకునే వారంటే ఇది ఏ రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ అయిందో చెప్పకక్కర్లేదు.
ఆవిధంగా ఈ సీరియల్ తో ప్రేక్షుకులకు బాగా దగ్గరైన మౌనిక టివి సీరియల్స్ లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తూ,ఈటీవీలో అభిషేకం,జి తెలుగులో రామసీత,జెమినిలో రాణివాసం,మాతృ దేవోభవ వంటి సీరియల్స్ లీడ్ రోల్స్ అలాగే పలు సినిమాలో క్యారక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రతేకమైన ఇమేజ్ తెచ్చుకుంది
టివి సీరియల్స్ లో అత్యధిక పెయిడ్ ఆర్టిస్ట్ గా దూసుకెళ్తున్న మౌనిక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, కేవలం సినిమాల కోసం వేచి ఉండకుండా, బుల్లితెర ను శాసిస్తూ,ఎందరికో ఆదర్శం అవుతోంది.