MoviesTollywood news in telugu

Simran:సిమ్రాన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా…ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు

Tollywood Heroine Simran:ఎట్రాక్టివ్ ఫిగర్ తో కుర్రకారుని గుబులు రేకెత్తించిన నటి సిమ్రాన్ స్పెషాలిటీయే వేరు. తన లేలేత పరువాలతో 1990లో ఇండస్ట్రీని ఉర్రూతలూగించిన ఈ స్లిమ్ బ్యూటీ కోసం అప్పట్లో టాప్ హీరోలు పోటీ పడేవారు. మోడ్రన్ దుస్తులే కాదు ఎలాంటి డ్రెస్సుల్లో నైనా గ్లామర్ ఉట్టిపడే సిమ్రాన్ కి అందమే కాదు అభినయం వుంది.

అందుకే ఛాన్సులు ఈ పంజాబీ ముద్దుగుమ్మ ని వెతుక్కుంటూ వచ్చాయి. దక్షిణాది భాషల్లో దాదాపు 80కి పైగా సినిమాల్లో నటించిన ఈ భామ పెళ్ళయ్యాక్క కూడా కొన్ని టెలివిజన్ ఛానల్స్ లో చేసింది.ముంబయిలో అశోక్ నావెల్ ,శారదా దంపతులకు 1976 ఏప్రియల్ నాలుగున జన్మించిన సిమ్రాన్ అసలు పేరు ఋషి బాల నావెల్. ఈమెకు మోనా,జ్యోతి అనే ఇద్దరు చెల్లెళ్ళతో పాటు సుమిత్ అనే సోదరుడున్నాడు.

బికాం పూర్తయిన వెంటనే మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్న సిమ్రాన్,ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యి,1995లో సోనమ్ హర్జే అనే మూవీలో నటించింది. న్యూజిలాండ్ లో షూటింగ్ చేసుకున్న మొదటి ఇండియన్ ఫిలిం అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇక అదే సమయంలో సూపర్ హిట్ ముఖాబ్ లే షో కి యాంకర్ చేయడంతో అమితాబ్ భార్య జయాబచ్చన్ చూసి, సిమ్రాన్ కి తన ప్రొడక్షన్ లో హీరోయిన్ ఛాన్సిచ్చి ఎంకరేజ్ చేసింది. తెరేమేరె సప్నే పేరిట 1996లో వచ్చిన ఆ మూవీ తో కొన్ని హిందీ సినిమాలు చేసి, అబ్బాయిగారి పెళ్లి మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

ప్రియా ఓ ప్రియా,మా నాన్నకి పెళ్లి,ఆటో డ్రైవర్ , సమర సింహా రెడ్డి,నరసింహనాయడు ,అన్నయ్య, కలిసుందాం రా,నువ్వొస్తావని, యువరాజు,డాడీ , ప్రేమతో రా, సీమ సింహం,సీతయ్య లాంటి బ్లాక్ బస్టర్ మూవీలతో టాప్ రేంజ్ కి చేరిన సిమ్రాన్ తమిళంలోనూ తన హవా కొనసాగించింది. జోడి, తుల్లా దమనం,పంబాల్ కే సంబంధం, ఎలుమళై, రమణ ,వంటి సూపర్ హిట్ చిత్రాలతో తమిళంలో కూడా అగ్ర హీరోయిన్ గా కొనసాగింది.

ఇక కెరీర్ పీక్ పొజిషన్ లో ఉండగానే దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన సిమ్రాన్,తన చిన్ననాటి ఫ్రెండ్ దీపక్ బగ్గాతో 2003డిసెంబర్ 2న వివాహం అయింది. వీరికి అదీప్, ఆదిత్ అనే ఇద్దరు కుమారులున్నారు. పెళ్లయ్యాక కూడా అడపాదడపా ఓ లుక్కేస్తూ సినీ ఇండస్ట్రీతో టచ్ లో వుంది ఈ బ్యూటీ. 2008లో బాలయ్య హీరోగా వచ్చిన మగాడు మూవీతో నటిగా జర్నీ కొనసాగించిన సిమ్రాన్,2015లో తన భర్తతో కల్సి సిమ్రాన్ అండ్ సన్స్ పేరుతొ ఓ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి సినీ నిర్మాణంలో ప్రవేశిచింది.

ఎన్నో అవార్డులు అందుకున్న సిమ్రాన్ తన కెరీర్ ని పరిపూర్ణం చేసుకున్న ఈమె ఫాంటా, కురుకురే,కోకో కోలా,కేడెలా హెల్త్ కేర్,వంటి యాడ్స్ లో తళుక్కున మెరుస్తూ, తన హవా చాటింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా తమిళంలో మూడు ఫిలిమ్స్ చేస్తోంది.