Ulava charu:ఉలవ చారు ఎక్కువగా తింటున్నారా… ఈ నిజాన్ని తెలుసుకోండి
Ulava charu health benefits In telugu : ఉలవలు అంటే పల్లెటూర్లో ఉండేవారికి బాగా పరిచయం ఒకప్పుడు సిటీ వాళ్లకు పెద్దగా తెలీదు కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్ ఆన్లైన్ స్టోర్ వచ్చాక ఉలవలు అనేవి అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. ఉలవలను వేగించుకుని స్నాక్ రూపంలో తీసుకోవచ్చు ఉలవలతో చారు గా చేసుకుని అన్నంలో తినవచ్చు.
ఉలవచారు బిర్యానీ సైతం కొన్ని రెస్టారెంట్ చేస్తున్నాయి. ఉలవలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉలవచారు తింటే అధిక బరువు తగ్గుతుంది. అధిక చెమట సమస్య ఉన్నవారికి చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది నీరసం అలసట నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉండేలా చేస్తుంది వాతం నొప్పులు మాయం అవుతాయి.
ఉలవలు పిండి ద్వారా వచ్చే పాలల్లో పంచదార కలుపుకొని తాగితే బాలింతలకు పాలు పెరుగుతాయి కంటి చూపు మెరుగుదలకు బాగా సహాయ పడుతాయి ఆయాసం తుమ్ములు రొంప దగ్గు వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది కడుపు నొప్పి అజీర్ణం సమస్యలను కూడా తగ్గిస్తుంది.
కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. అయితే ఉలవలను వాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఉలవలను ఎక్కువగా వాడితే వేడి చేస్తుంది అందువల్ల లిమిట్ గా తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.