curd and sugar:పెరుగులో పంచదార కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?
curd and sugar : పెరుగు,పంచదారలలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఉదయం సమయంలో పెరుగులో పంచదార కలిపి తింటే శరీరానికి ఉత్ప్రేరకంగా పనిచేసి శరీరానికి, మనస్సుకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ఎండలు ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో తింటే శరీరానికి మంచి మొత్తంలో గ్లూకోజ్ లభిస్తుంది. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. అలసట, నీరసం, నిసత్తువ వంటివి తగ్గుతాయి. పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగి పొట్టకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఉదయాన్నే పెరుగు, పంచదార తింటే పొట్ట చల్లగా ఉంటుంది. ఇది కడుపులో చికాకు, అసిడిటీని కూడా తగ్గిస్తుంది. పాలు కన్నా పెరుగు త్వరగా జీర్ణం అవుతుంది. దాంతో కడుపు తేలికగా ఉంటుంది. ఈ మిశ్రమం తినడం వల్ల బ్లాడర్ కూల్ గా ఉంటుంది. దీని వల్ల మూత్ర సమస్యలు రావడం.. వేడి చేయడం లాంటివి కూడా ఉండవు.
నీరు తక్కువగా తాగే వారు.. పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన నీరు కూడా అందుతుంది. మతిమరుపు తగ్గి జ్ఞాపకశక్తి పెరుగు తుంది. పెరుగు పదార్థాలు తింటే వేడి శరీరం వారికి మంచిది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే శక్తి మెరుగవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.