Bananas:మధుమేహం ఉన్నవారు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
How Bananas Affect Diabetes and Blood Sugar Levels :ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, జీవనశైలి అలవాట్లు కారణంగా వయసుతో సంబంధం లేకుండానే చాలా చిన్న వయసులోనే మధుమేహం వచ్చేస్తుంది. మధుమేహం రాగానే ప్రతి ఒక్కరు కంగారు పడిపోతూ ఏమి తినాలి ఏమి తినకూడదు అనే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.
ముఖ్యంగా పండ్లు తినవచ్చా లేదా అనే విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. పండ్లు తియ్యగా ఉంటాయి. కనుక మధుమేహం ఉన్నవారు తినకూడదు… అని ఒక అపోహ కూడా ఉంది. మధుమేహం వచ్చిన వారు అరటిపండు తినకుండా దూరంగా ఉంటారు. అరటి పండును లిమిట్ గా తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.
అరటిపండు లిమిట్ దాటితే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మధుమేహం ఉన్నవారు అరటిపండు ఏ మోతాదులో తీసుకోవాలి అనే విషయం గురించి డాక్టర్ ని సంప్రదించాలి. అరటిపండులో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. మధ్య తరహా అరటిపండులో 14 గ్రాముల చక్కెర మరియు 6 గ్రాముల స్టార్చ్ ఉంటుంది.
కానీ అరటిపండులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అరటిపండ్లు తక్కువ GI స్కోర్‌ను కలిగి ఉంటాయి మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండు సరైన ఎంపిక. అయితే ఒక చిన్న అరటిపండు వారానికి రెండు లేదా మూడుసార్లు తినాలి. కానీ, మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ అరటిపండును తినకూడదు. ఈ విషయాన్నీ గుర్తుంచుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.