Immunity Milk:100% ఇమ్యూనిటీని పెంచి దగ్గు,జలుబు,జ్వరంలను 2 రోజులో మాయం చేస్తుంది
immunity booster Milk In Telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మన శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుకోవలసిన అవసరం ఉంది. దాని కోసం మనం మందుల జోలికి వెళ్లకుండా మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో పాలను తయారుచేసుకొని తాగవచ్చు. చలి గాలులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మంచు కూడా విపరీతంగా ఉంటుంది.
ఈ వాతావరణంలో చాలా తొందరగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చేస్తు ఉంటాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు ప్రారంభంలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించి ఆ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే పాలను తాగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
పొయ్యి మీద ఒక గ్లాస్ పాలను పెట్టి కాస్త వేడి అయ్యాక 5 మిరియాలను దంచి వేయాలి. ఆ తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి దంచి వేయాలి. ఆ తర్వాత పావు స్పూన్ పసుపు వేసి 5 నిమిషాలు మరిగించాలి. ఈ పాలను 2 రోజుల పాటు తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.
అలాగే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. శరీరంలో రోగనిరోదక శక్తి బలంగా ఉంటే ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు. కాబట్టి ఈ పాలను తీసుకొని దగ్గు, జలుబు, గొంతు నొప్పిల నుండి బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.