Kitchenvantalu

Dal khaman:గుజరాత్ స్పెషల్ దాల్ ఖమన్ ఎప్పుడైనా ట్రై చేసారా..

Dal khaman:గుజరాత్ స్పెషల్ దాల్ ఖమన్ ఎప్పుడైనా ట్రై చేసారా..ఎప్పుడు తెలుగింటి వంటకాలే కాదు అప్పుడప్పుడు పొరుగింటి పుల్ల కూరలు కూడ ట్రై చేసి చూడాలి.గుజరాత్ స్పెషల్ దాల్ ఖమన్ ఎప్పుడైనా ట్రై చేసారా లేదా,అయితే ఇప్పుడే చేయండి.కొంచెం పుల్లగా కొంచెం తియ్యగా రుచికి కమ్మగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు
పచ్చి శనగపప్పు -1.5 కప్పు
బియ్యం -2 టేబుల్ స్పూన్స్
మినపప్పు-2 టేబుల్ స్పూన్స్
పెరుగు -1/2 కప్పు
ఉప్పు-తగినంత
నూనే-4 టేబుల్ స్పూన్స్
ENO-1 టీ స్పూన్
వంట సోడా-1/4 టీ స్పూన్
పసుపు-1/2 టీ స్పూన్
కొత్తిమీర తరుగు-1 టేబుల్ స్పూన్
కొబ్బరి తురుము-3 టేబుల్ స్పూన్స్
అల్లం పచ్చిమిర్చి తురుము-3 1 టీస్పూన్
పచ్చిమిర్చి -1
అల్లం -1 ఇంచ్
నిమ్మ ఉప్పు- 1/8 టీ స్పూన్
నిమ్మరసం- 1టీ స్పూన్
వెల్లుల్లి-10-12
ఆవాలు-1.5 టీ స్పూన్
పచ్చిమిర్చి-5
కరివేపాకు రెబ్బలు-3
చక్కర -1.5 టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా శనగ పప్పు,మినపప్పు,బియ్యం,బాగా కడిగి నాలుగు గంటల పాటు నాన పెట్టుకోవాలి.
2.నాని పప్పులు బియ్యాన్ని ఒక మిక్సి జార్ లో వేసుకోని పెరుగు కలుపుకోని రవ్వరవ్వగా గ్రైండ్ చేసుకోవాలి.
3.రుబ్బుకున్న పిండిలో ఉప్పు,నూనే వేసి గరిటతో బాగా బీట్ చేసుకోవాలి.
4.మూతపెట్టి ఐదు గంటల పాటు నాననివ్వాలి.
5.ఇప్పుడు మిక్సీ జార్ లోకి అల్లం ,పచ్చిమిర్చి వేసి అందులోకి, వెల్లుల్లి, నిమ్మరసం, బరకగా పేస్ట్ చేసుకోవాలి.
6. ఇప్పుడు కేక్ మౌల్ట్ ను నూనె అప్లై చేసుకోని పక్కన పెట్టుకోవాలి.
7. ఐదుగంటల తర్వాత నానిన పిండిలో, పసుపు, నూనె, అల్లం, పచ్చిమిర్చి వేసి, మరో రెండు నిమూషాలు బీట్ చేసుకోవాలి.
8. తర్వాత వంట సోడా, ENO వేసి, దానిపై నిమ్మరసం వేసుకుని, ఒకేవైపు కలుపుకోవాలి.
9. ఇప్పుడు పొంగిన పిండిని, కేక్ మౌల్డ్ లో పోసి, కుక్కర్ లో, స్టాండ్ పెట్టుకుని, దానిపై, ఉంచాలి.
10. మూత పెట్టి ఆవిరి పై, 8 నిముషాలు హై ఫ్లేమ్ మీద, 10 నిముషాలో లో ఫ్లేమ్ మీద, ఆవిరితో ఉడకనివ్వాలి.
11. 8 నిముషాల తర్వాత, టూత్ పిక్ సాయంతో ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి.
12. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, దానిపై ఒక క్లాత్ ను కప్పి, చల్లారనివ్వాలి.
13. చల్లారిన ఖమన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
14. ఇప్పుడు తాళింపు కోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని, అందులోకి కొద్దిగా నీళ్లు పోసుకుని, ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకు ముక్కలు వేసి, వేపుకుని, కొద్దిగా చెక్కర వేసి, హై ఫ్లేమ్ పై, ఒక పొంగు రానిచ్చి దించుకోవాలి.
15. ఇప్పుడు ఈ తాళింపు నీళ్లలో ఖమన్ ముక్కలను తడుపుకోవాలి.
16. ఒక ప్లేట్ లోకి తీసుకుని సన్నని కొత్తిమీర ,కొబ్బరి తురుము చల్లుకుని, సెర్వ్ చేసుకోవాలి.
17. అంతే, దాల్ ఖమన్ రెడీ అయినట్లే..