Paneer kofta biryani:వీకెండ్ స్పెషల్ పనీర్ కోఫ్తా బిర్యానీ..సింపుల్ అండ్ టేస్టీ
Paneer kofta biryani:వీకెండ్ స్పెషల్ పనీర్ కోఫ్తా బిర్యానీ..సింపుల్ అండ్ టేస్టీ..వారం మొత్తం ఏ వంటకాలతో కానిచ్చేసినా,వీకెండ్స్ లో మాత్రం కాస్త స్పెషల్స్ కోసం వెతుకుతూ ఉంటాం.ఈ వీకెండ్ కు గరం గరంగా, ఘాటు ఘాటు గా, పన్నీర్ కోఫ్తా బిర్యాని ట్రై చేసి చూడండి.
కావాల్సిన పదార్థాలు
పన్నీర్ కోఫ్తా కోసం..
పన్నీర్ తురుము – 150 గ్రాములు
ఉడికించిన ఆలు తురుము – 2 కప్పులు
తెల్లమిరియాల పొడి – ¼ టీ స్పూన్
నల్ల మిరియాల పొడి – 1/2టీ స్పూన్
చక్కెర – 1/3 టీ స్పూన్
కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్స్
సన్నని పచ్చిమిర్చి తరుగు – 2 టేబుల్ స్పూన్స్
యాలకుల పొడి – 1/2టీ స్పూన్
ఉప్పు – తగినంత
కార్న్ ఫ్లోర్ – 2 టీ సూన్స్
మైదా – 1 టేబుల్ స్పూన్
కోఫ్తా కర్రీ కోసం..
నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్
నూనె – 2 టీ స్పూన్స్
దాల్చిన చెక్క – 1 ఇంచ్
యాలకులు – 2
లవంగాలు – 5
బిర్యాని ఆకు – 1
షాహీ జీర – 1 టేబుల్ స్పూన్
అనాస పువ్వు -1
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
జీడిపప్పు పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్
టమాటో ముక్కలు – 1/2కప్పు
కారం – 1/2టీ స్పూన్
గరం మసాలా – ¾ టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
పెరుగు – 1./2 కప్పు
పచ్చిమిర్చి – 3
పుదీనా – 2 టేబుల్ స్పూన్
కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్
రైస్ వండటానికి
బాసమతి రైస్ – 300 గ్రాములు
నీళ్లు – రెండు లీటర్లు
సాజీర – 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క – 2 ఇంచ్
యాలకులు -6
లవంగాలు – 6
నల్లయాలక -1
బిర్యాని ఆకు -2
మరాఠీ మొగ్గలు 2
అనాస పువ్వు -3
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1.5 టేబుల్ స్పూన్
ఎండిన గులాబి రేకులు – 2 టేబుల్ స్పూన్స్
పచ్చిమిర్చి ముక్కలు -3
ఉప్పు – 3 టేబుల్ స్పూన్స్
పాలు -3 టేబుల్ స్పూన్స్
ఇప్పుడు ధమ్ చేయడానికి..
నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్
అన్నం వండుకున్న నీళ్లు -3 టేబుల్ స్పూన్స్
జాజికాయ పొడి – 2 చిటికెలు
కొత్తిమీర – కొద్దిగా
కుంకుమపువ్వు నీళ్లు – ½ స్పూన్
తయారీ విధానం
1.కోఫ్తా కోసం తీసుకున్న పదార్థాలు అన్ని ఒక గిన్నెలో వేసుకుని బాగా కలుపుకోవాలి.
2. కలుపుకున్న పన్నీర్ ను , ఆఖరున మైదా, కార్న్ ఫ్లోర్, వేసి, బాగా పగుళ్లులేకుండా , ఉండలు చుట్టుకోవాలి.
3. ఉండలుగా చుట్టుకున్న కోఫ్తాలను, నూనెలో పగిలిపోకుండా డీప్ ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు కోఫ్తా కర్రీ కోసం ఒక పాన్ పెట్టుకుని, అందులోకి నూనె,. నెయ్యి వేసుకుని, కరగనివ్వాలి.
5. వేడెక్కిన నెయ్యి లోకి, యాలకులు, లవంగాలు, సాజీర, చెక్క, బిర్యాని ఆకు, అనాసపువ్వు, ఉల్లిపాయ తరుగు వేసి ఎర్రగా వేపుకోవాలి.
6. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఒక నిముషం పాటు వేగనివ్వాలి. అందులోకి టమాటో ముక్కులను వేసి గుజ్జుగా తయారయ్యావరకు కలుపుకోవాలి.
7.టమాటో గుజ్జుగా అవుతుండగా కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మాసాల, ఉప్పు వేసుకుని, ఉడికించాలి.
8. నూనె పైకి తేలాక, జీడిపప్పు పేస్ట్ ను, నీళ్లు వేసి బాగా కలపాలి.
9. ఇప్పుడు స్టవ్ ఆపేసి పెరుగు ,తగినన్ని నీళ్లు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు వేసి, బాగా కలిపి, స్టవ్ ఆన్ చేసి ఒక పొంగు రానివ్వాలి.
10. ఉడుకుతున్న గ్రేవీలో వేపుకున్న కోఫ్తాలు వేసి, ఒక నిముషం పాటు ఉడకనివ్వాలి.
11. నిముషం తర్వాత సగం కోఫ్తాలు, సగం గ్రేవీ తీసి పక్కన ఉంచండి.
12. ఇప్పుడు రైస్ ఉండుకోవడానికి , ఒక గిన్నెలో నీళ్లు పోసి, మసాలు వేసి, ఎసరు వచ్చేవరకు, మరగనివ్వాలి.
13. మరుగుతున్న ఎసరులో నానపెట్టిన బియ్యం, పాలు పోసి, 80 శాతం ఉడికించుకోవాలి.
14. ఆ బాస్మతీ బియ్యాన్ని, సగం తీసుకుని వడకట్టి, కోఫ్తా పైన వేసుకోవాలి.
15. పక్కన పెట్టుకున్న కోఫ్తా గ్రేవీ, కోఫ్తాలు మొత్తం రైస్ పై పోసి, మిగిలిన రైస్, కోఫ్తాలపై వేసుకోవాలి.
16. ఇప్పుడు రైస్ పైన, జాజికాయ పొడి, కొత్తిమీర తరుగు, నెయ్యి, అన్నం ఉడికిన నీళ్లు పోసి, సిల్వర్ ఫాయిల్త్ తో సీల్ చేసి, మూత పెట్టి, 12 నిముషాలు సిమ్ లో ధమ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని 20 నిముషాలు వదిలేయాలి.
17. 20 నిముషాల తర్వాత, సీల్ ఒపెన్ చేసి అన్నం పైన, కుంకుమ పువ్వు నీళ్లు పోసి , అడుగునుండి, అట్లకాడతో తీసుకుని,
సెర్వ్ చేసుకోవాలి.
18. వేడి వేడి పన్నీర్ కోఫ్తా బిర్యాని సిద్ధం.