Kitchenvantalu

Tomato Pappu:టమాటో పప్పు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి

Tomato Pappu:టమాటో పప్పు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి..పప్పు అంటే ఇష్టపడని వారు ఉండరు.మన సంప్రదాయ వంటల్లో,పప్పుది ఎప్పుడు ప్రధమ స్థానమే.ఇంట్లో చేసుకున్న పప్పు కన్నా,ఫంక్షన్స్ లో వండే పప్పు,కాస్త రుచి ఎక్కువగా అనిపిస్తుంది.అచ్చం ఫంక్షన్స్ లో చేసే,టమాటా పప్పును ,ఇంట్లో కూడా ఈ విధంగా ట్రై చేయండి.

కావాల్సిన పదార్థాలు
కందిపప్పు – 3/4కప్పు
పచ్చిశనగపప్పు – 1/4కప్పు
పసుపు – 1/4టీస్పూన్
నూనె – 4 టీస్పూన్
ఉల్లిపాయ తరుగు -1 కప్పు
పచ్చిమిర్చి- 3
ఉప్పు – తగినంత
కారం – 1.5 టేబుల్ స్పూన్స్
టమాటో ముక్కలు – 250 గ్రాములు
సాంబార్ పొడి – 1.5 టేబుల్ స్పూన్స్
చింతపండు పులుసు – 3 టేబుల్ స్పూన్స్
నెయ్యి – 1 టీస్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
ఎండుమిర్చి -3
జీలకర్ర -1 టీ స్పూన్
కరివేపాకు రెబ్బలు – 2
ఇంగువ – రెండు చిటికెలు

తయారీ విధానం
1.కందిపప్పును బాబా శుభ్రంగా కడిగి, కుక్కర్ లో వేసుకుని, శనగపప్పుతో పాటు , పసుపు, నీళ్లు పోసుకుని,మూత పెట్టి, రెండు విజిల్స్, వచ్చేవరకు ఉడికించాలి.
2. ఆవిరిపోయాక, ఉడికినపప్పును, పప్పు గుత్తి సాయంతో మెత్తగా చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని, నూనె వేసి, అందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసి, వేగనివ్వాలి.
4. ఆపై పచ్చిమిర్చి, ఉప్పు, కారం, వేసి మరికాసేపు వేగనివ్వాలి.
5. వేగిన ఉల్లిపాయల్లో , టమాటో ముక్కులు వేసి మూత పెట్టి, 3 నిముషాలు ఉడకనివ్వాలి.
6. 3 నిముషాల తర్వాత అందులోకి సాంబార్ పొడి, చింతపండు పులుసుపోసుకుని, టమాటో మెత్తపడేవరకు,ఉడికించాలి.
7. ఇప్పుడు అందులోకి, ముందుగా చేసుకున్న పప్పును, వేసుకుని కొద్దిగా నీళ్లువేసి బాగా కలిపి, ఐదు నిముషాలు ఉడకనివ్వాలి.
8. ఇప్పుడు స్టవ్ పై వేరే పాన్ పెట్టుకుని, తాళింపు కోసం నూనె వేసి ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుని,ఎండుమిర్చి, కరివేపాకు, వేసి ఎర్రగా వేపుకోవాలి.
9. ఇప్పుడు తయారు చేసుకున్న తాళింపును పప్పులో కలుపుకుని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
10. అంతే, టమాటో పప్పు రెడీ.