MoviesTollywood news in telugu

Allu Arjun:ఆ హీరోయిన్ కి పెళ్లి అయితే బన్నీ బాధపడ్డాడట… నిజామా..?

Allu Arjun:ఆ హీరోయిన్ కి పెళ్లి అయితే బన్నీ బాధపడ్డాడట… నిజామా.. అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ గంగోత్రి ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ చూపిస్తూ,అనతికాలంలోనే స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. పుష్పగా కొత్త అవతారం ఎత్తి గుబురు గడ్డంతో చిత్తూరు యాసలో డైలాగ్ లు చెప్పుతూ అభిమానులను ఆకట్టుకున్నాడు. తనపై మైకేల్ జాక్సన్ ప్రభావం ఎక్కువగా ఉంటుదని, నా డ్రెస్సింగ్ స్టైల్ లో వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని బన్నీ చెప్పాడు.
Tollywood Hero Allu Arjun
అందుకే ఇంట్లో ఉన్న కూడా స్టైల్ గా నేను తయారవుతుంటాను. ఇక తనకు” టైటానిక్ ”సినిమా అంటే చాలా ఇష్టమని, మెగాస్టార్ చిరంజీవి నటించిన ”ఇంద్ర” సినిమా, ”గల్లీ బాయ్” కూడా చాలా ఇష్టమని చెప్పాడు. ప్రస్తుతం తాను వాడుతున్న ఎస్ యు వి రోగ్ కార్ అంటే తనకు ఇష్టమని, రెండున్నర కోట్లు పెట్టి కొన్నానని చెప్పాడు. రుద్రమదేవి సినిమాకి తాను రెమ్యునేషన్ తీసుకోకుండా నటించడం సంతృప్తి ఇచ్చిందన్నాడు.
Allu arjun and Sneha reddy
సినిమాల్లోకి రాకముందు తను యానిమేషన్ మీద ఉన్న ఇష్టంతో ఆ కోర్సు నేర్చుకుని, ఓ కంపెనీలో కొద్ది రోజులు అప్రెంటిస్ గా పని చేశాడట. అక్కడ బన్నీకి ఇచ్చిన జీతం 3500 రూపాయలు, అదే నా తొలి సంపాదన అని చెప్పుకొచ్చాడు. నా పెళ్లి అయినప్పుడు అమ్మాయిలు ఎంత బాధ పడ్డారో, ఐశ్వరరాయ్ పెళ్లయినప్పుడు నేను అంతే బాధపడ్డా’ అని బన్నీ చెప్పాడు. సోనం కపూర్ స్టైల్ నాకు ఇష్టం.. మన తెలుగులో విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చుతుంది..
Tollywood hero Allu arjun
సంవత్సరానికి ఒక్కసారైనా ప్యారిస్ వెళుతుంటాం.. మా అబ్బాయి అయాన్ కి ప్యారీస్ అంటే చాలా ఇష్టం అని వివరించాడు. బాలీవుడ్ యాక్టర్ గోవింద డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన స్టెప్పులు వేస్తుంటే నా చూపు తిప్పుకోలేనని బన్నీ అన్నాడు. ‘నాకు స్ఫూర్తి నిచ్చే వాళ్లలో ఒకరైన అమితాబచ్చన్ వయస్సు పెరుగుతున్న సరే కుర్రాడిలా దూసుకుపోతున్నారు. నేను కూడా ఆయనలా ఆ వయసు లోను నటించాలని నా కోరిక’అని బన్నీ చెప్పాడు.