Tollywood:మహేష్,పవన్ లకు ఇమేజ్ తెచ్చిన సినిమాలు…ఎన్ని కోట్ల లాభమో…?
Tollywood:మహేష్,పవన్ లకు ఇమేజ్ తెచ్చిన సినిమాలు…ఎన్ని కోట్ల లాభమో… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సూపర్ స్టార్ మహేష్ బాబు లను తమ కెరీర్ లో మలుపు తిప్పిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే , మొదట్లో ఇమేజ్ తెచ్చిన సినిమా ఏమిటని పరిశీలిస్తే,పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి,మహేష్ నటించిన పోకిరి సినిమాలు వారి స్టార్ డమ్ ని అమాంతం పెంచేసాయి. ఖుషి సినిమా వచ్చి 19ఏళ్ళు పూర్తికాగా, పోకిరి మూవీ వచ్చి 14ఏళ్ళు అవుతోంది.
ఇందులో ఖుషి మూవీ 2001ఏప్రియల్ 27న విడుదలైంది. లవ్ స్టోరీస్ లో ట్రెండ్ సెట్టర్ అయింది. పవన్ మేనరిజం,స్టైల్,డ్రెస్సింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. ఆడియో రిలీజ్ లోనే ఆల్ టైం రికార్డ్ కొట్టిన ఖుషి .. 30కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. నైజాం లో 8కోట్ల షేర్ వసూలు చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. హైదరాబాద్ లో 100రోజులకు సింగిల్ థియేటర్ లో 88లక్షల షేర్ కలెక్ట్ చేసింది. పవన్ కేరీర్ ని ఈ సినిమా మార్చేసింది.
ఇక మహేష్ నటించిన పోకిరి 2006ఏప్రియల్ 28న విడుదలైంది. మహేష్ నటన, ఆటిట్యూడ్,మేనరిజం,స్టైల్ అన్నీ కల్సి ఈ సినిమాను కమర్షియల్ గా రికార్డ్ క్రియేట్ చేసేలా చేసింది. మహేష్ సినిమాల్లో ఇది బెంచ్ మార్క్. టాలీవుడ్ లో మొదటి సారిగా 50కోట్ల గ్రాస్ వసూలుచేసిన సినిమాగా నిల్చింది. ఈ సినిమా సింగిల్ థియేటర్ రికార్డ్ బాహుబలి 2వరకూ ఏదీ అధిగమించలేదు. తిరుగులేని హీరోగా నిలబెట్టింది ఈ మూవీ.