villans turn heroes:విలన్ నుండి హీరోగా సక్సెస్ అయినా 8 మంది నటులు వీళ్ళే..
villans turn heroes:విలన్ నుండి హీరోగా సక్సెస్ అయినా 8 మంది నటులు వీళ్ళే.. మొదట్లో చిన్న చిన్న పాత్రలతో మెప్పిస్తూ, విలన్స్ గా రాణిస్తూ, ఛాన్స్ వచ్చాక హీరోగా వేసి,నిలదొక్కుకున్నవాళ్లు టాలీవుడ్ లో కొందరు ఉన్నారు. ఇందులో మొదటగా మెగాస్టార్ చిరంజీవిని ప్రస్తావించాలి.
ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి,చిన్న చిన్న పాత్రలు వేస్తూ విలన్ గా మెప్పించారు. కమలహాసన్,జయసుధ జంటగా నటించిన ఇది కథ కాదు;శోభన్ బాబు ,శ్రీదేవి జంటగా నటించిన మోసగాడు;47రోజులు,న్యాయం కావాలి ,తిరుగులేని మనిషి చిత్రాల్లో విలన్ గా నటించాడు. ఆతరువాత హీరోగా మరి,మెగాస్టార్ అయ్యాడు.
సూపర్ స్టార్ రజనీకాంత్ మొదట్లో విలన్ పాత్రలతో రాణించి, కథా సంగమ,సంసార మూవీస్ కి మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత హీరో అయ్యాడు.డైలాగ్ కింగ్ మోహన్ బాబు గుక్క తిప్పుకోకుండా డైలాగ్ లు చెప్పడంలో దిట్ట. స్వర్గం నరకం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యితడు ఇప్పటికి 500కి పైనే చిత్రాల్లో చేసాడు. విలన్, సపోర్టింగ్ రోల్స్ వేస్తూ ఆతరువాత హీరో అయ్యాడు. విలనిజానికి మారుపేరు గా నిల్చిన మోహన్ బాబు తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు. 200పైగా సినిమాల్లో విలన్ రోల్స్ చేసి,తర్వాత హీరోగా మారి రాణిస్తూ, ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.
జెడి చక్రవర్తి మొదట్లో విలన్ పాత్రలతో మెప్పించాడు. శివ సినిమాలో విలనిజం పండించి పలు సినిమాల్లో విలన్ గా వేసాడు. నేటి సిద్దార్ధ మూవీతో హీరోగా మారాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కన్నడ,మలయాళ మూవీస్ చేస్తున్నాడు. ఇక డాక్టర్ రాజశేఖర్ వందేమాతరం మూవీతో హీరోగా వచ్చి,తలంబ్రాలు మూవీలో విలన్ క్యారెక్టర్ పండించి,నంది బహుమతి పొందాడు. ప్రస్తుతం హీరోగా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నాడు.
హీరో శ్రీకాంత్ మొదట్లో విలన్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ వేస్తూ తాజమహల్ మూవీతో హీరోగా మారాడు. హీరో శ్రీహరి కూడా మొదట్లో విలనిజంలో మెప్పించి 10ఏళ్లపాటు విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి,1999లో పోలీస్ మూవీతో హీరో అయ్యాడు. హీరో గోపీచంద్ తొలివలపు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సక్సెస్ దక్కకపోవడంతో రూటు మార్చాడు.
విలన్ గా సై అంటూ తేజ డైరెక్షన్ లో వచ్చిన జయం మూవీ ద్వారా విలన్ క్యారెక్టర్ చేసి అందరి మెప్పు పొందాడు. వర్షం మూవీలో ప్రభాస్ ,నిజం సినిమాలో మహేష్ బాబు లతో ఎదురొడ్డి విలనిజం పండించాడు. ఆతర్వాత హీరోగా కొనసాగుతున్నాడు.
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK