MoviesTollywood news in telugu

Venkatesh:18 ఏళ్ల వయస్సులో తన అభిమాన హీరో కోసం వెంకటేష్ ఏమి చేసాడో తెలుసా?

Venkatesh:18 ఏళ్ల వయస్సులో తన అభిమాన హీరో కోసం వెంకటేష్ ఏమి చేసాడో తెలుసా.. సినీ ఇండస్ట్రీలో రకరకాల వింతలూ విడ్డూరాలు జరుగుతుంటాయి. అందులో కొన్ని యాదృచ్చికంగా జరిగేవి అయితే,,కొన్ని హాబీతో చేసేవి ఉంటాయి. ఇక టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ అంటే లేడీ ఫాన్స్ ఎక్కువగా ఉన్న హీరోగా పేరుంది. ఎన్నో హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. అయితే వెంకీకి చిన్నప్పటి నుంచి అందాల నటుడు శోభన్ బాబు అంటే ఎంతోఇష్టమట.
Venkatesh
ఆ ఇష్టంతోనే చిన్న వయస్సులోనే శోభన్ బాబుతో ఓ మూవీ నిర్మాణం కూడా అదీ తన పేరుతోనే చేసాడట. అవును, అసలు సినిమా హీరో అవ్వాలనే ఆశ వెంకీ లేదు. తన అభిమాన నటుడు శోభన్ బాబుతో సినిమా చేయాలనీ అనుకున్నాడు. అప్పటికే తన సోదరుడు పేరిట తండ్రి రామానాయుడు స్థాపించిన సురేష్ మూవీస్ ఒక వెలుగు వెలుగుతోంది.

ఇక 18 వయస్సులో వెంకీ సినిమా తీయాలని అనుకుంటే, సురేష్ బ్యానర్ పై చేయాలనీ రామానాయుడు సూచించారు. అయితే వెంకీ మాత్రం వెంకటేష్ ఎంటర్ ప్రయిజెస్ పేరుతొ బ్యానర్ పెట్టి,శోభన్ బాబుని కల్సి ప్రపోజల్ చెప్పాడు. శోభన్ బాబు ఒకే చెప్పడంతో 1978లో ఎంకి నాయుడు బావ మూవీని శోభన్ బాబు ,వాణిశ్రీ జంటగా వెంకటేష్ సినిమా తీసాడు.

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK