Acidity: ఎసిడిటీ మాత్రలు ఎక్కువగా వాడుతున్నారా… అయితే ప్రమాదంలో పడినట్టే..
Acidity: ఎసిడిటీ మాత్రలు ఎక్కువగా వాడుతున్నారా… అయితే ప్రమాదంలో పడినట్టే.. మారిన జీవన విధానం, మారిన అలవాట్లు,బిజీ జీవనశైలి వంటి కారణాల వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఇంటిలో తినటం మానేసి బయట తినేవారి సంఖ్య చాలా పెరిగిపోతుంది. అంతేకాకుండా ఫంక్షన్లు, పార్టీల్లో బిర్యానీ, చికెన్, మటన్, ఫిష్ తో అనేక రకాల వంటలను తినేస్తూ ఉన్నారు.
దాంతో గ్యాస్,ఊబకాయం వంటి సమస్యలు ప్రధానంగా వస్తున్నాయి. ఈ సమస్యల నుండి బయట పడటానికి మార్కెట్ లో దిరికే ఎసిడీటీ మాత్రలు, టానిక్ లు, పౌడర్ లను వేసుకొని తాత్కాలిక ఉపశమనాన్ని పొందుతున్నారు. అయితే వీటిని వాడటం చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎసిడిటీ మాత్రలను ఎక్కువగా వాడటం వలన వాటి ప్రభావం కిడ్నీల మీద పడి కిడ్నీ సమస్యలు వస్తాయని అమెరికాలో జరిగిన ఒక పరిశోధనలో తేలింది. అసిడీటీ మాత్రలు వాడుతున్న దాదాపు 2,75,000 మందిపై వీరు పరిశోధన చేశారు.వారిలో ఎసిడీటీ మాత్రలు వేసుకున్న వారిలో మరణం రేటు 50శాతం పెరుగుతుందని తేల్చారు.
అతిగా తిని కడుపు ఉబ్బరంతో మాత్రలు వేసుకోవటం కన్నా మితంగా తింటే మంచిదని వైద్యులు అంటున్నారు. ఒకవేళ ఎసిడిటి వచ్చినప్పుడు సహజ సిద్దమైన పదార్ధాలతో తగ్గించే ప్రయత్నం చేయాలనీ….అప్పటికి తగ్గకపోతేనే ఎసిడిటి మాత్రలు లేదా పౌడర్ ల జోలికి వెళ్లాలని డాక్టర్స్ అంటున్నారు. ఏది ఏమైనా ఎసిడిటి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.