Banana Leaf:అరటి ఆకులో భోజనం చేస్తున్నారా… ఈ విషయాలు మీకు తెలుసా..
Banana Leaf:అరటి ఆకులో భోజనం చేస్తున్నారా… ఈ విషయాలు మీకు తెలుసా.. అరటి ఆకులో భోజనం చేయటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అరటి ఆకులో భోజనం చేయటం అనేది పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. ఇప్పటికీ చాలా మంది అరటి ఆకులో భోజనం చేస్తూ ఉంటారు. అరటి ఆకులో భోజనం చేస్తే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
అరటి ఆకులో భోజనం చేస్తే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అంతేకాక కడుపులో వచ్చే అలర్జీ, గ్యాస్,కడుపు ఉబ్బరం మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. వేడివేడిగా ఉండే భోజనాన్ని అరటి ఆకుపై పెట్టగానే దానిపై ఉండే ఒక పొర కరిగి అన్నంలో కలిసిపోతుంది.
ఇది అన్నానికి ఒకరకమైన రుచిని ఇస్తుంది. అంతేకాకుండా ఆకలి లేనివారిలో ఆకలిని పుట్టిస్తుంది. అరటి ఆకులో పొటాషియం ఉండుట వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కిడ్నీకి సంబంధించిన వ్యాధులను దూరం చేయడంలో అరిటాకు ఎంతో సహాయపడుతుంది. అరటి ఆకులలో పాలీ ఫినాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండుట వలన ఆహారంలో ఏవైనా క్రిములు ఉంటే నశిస్తాయి. అందుకే పూర్వ కాలంలో ఒకవేళ ఆహారంలో విషం కలిపితే అరటాకు రంగును బట్టి తెలుసుకునే వారట. ఆహారం మామూలుగా ఉంటే రంగు మారదు…కానీ అందులో ఏదైనా శరీరానికి హానిచేసే పదార్థాలు ఉంటే రంగు నీలంగా లేదా నల్లగా మారిపోతుందట.
అరటి ఆకులో భోజనం చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అరటి ఆకులో రోజూ భోజనం చేయడం వల్ల చాలా రకాల దీర్ఘాకాలిక వ్యాధులు కూడా నయం అవుతాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న అరటి ఆకులో భోజనం చేసి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు. అరటి ఆకులు కూడా ఈ మధ్య ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.