Hair Growth tips:ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది
Hair Growth tips:ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితి, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో జుట్టుకి పోషణ తగ్గి జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే జుట్టుకు అవసరమైన పోషణ అంది జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
ఒక బౌల్లో రెండు స్పూన్ల బియ్యం, ఒక స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా కడిగి దానిలో నీటిని పోసి రాత్రంతా అలా వదిలేయాలి. మరుసటి రోజు నీటిని వడగట్టి మెంతులు, బియ్యం మెత్తగా మిక్సీ చేయాలి. వడకట్టిన నీటిని పోసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె కలపాలి. ఈ పేస్ట్ ని జుట్టుకి బాగా పట్టించాలి.
ఇది కూడా చూడండి- ఈ సీజన్ లో మాత్రమే దొరికే ఈ ఆకును తింటే ఊహించని ఎన్నో ప్రయోజనాలు
ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయడం వలన జుట్టుకు అవసరమైన పోషకాలు అంది జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా క్రమంగా తగ్గుతుంది. మెంతులలో ఉన్న లక్షణాలు పగిలిన, దెబ్బతిన్న జుట్టు కుదుళ్లను, నిస్తేజంగా మారిన జుట్టును రిపేర్ చేసి కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
బియ్యం జుట్టుకి మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. జుట్టు చిక్కు పడకుండా చేస్తుంది.. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.