Health Tips:అర గ్లాసు పాలలో ఈ పొడి కలిపి తాగితే..ముఖ్యంగా ఆ సమస్యలకు చెక్
Health Tips:అర గ్లాసు పాలలో ఈ పొడి కలిపి తాగితే..ముఖ్యంగా ఆ సమస్యలకు చెక్.. మనలో చాలామంది మెంతులను ప్రతి రోజు తీసుకుంటూ ఉంటారు. మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ప్రోటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి, కె, బి, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, రాగి, జింక్, ఫైబర్ తదితర పోషకాలు సమృద్దిగా ఉన్నాయి.
కొంతమంది రాత్రి సమయంలో అరస్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగుతూ ఉంటారు. అయితే ప్రతిరోజు గోరువెచ్చని పాలలో పావు స్పూన్ మెంతి పొడి కలిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. .
ఈ విధంగా ఈ పాలను తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి పాలు, మెంతులు రెండు సహాయపడతాయి. మెంతి పిండి కలిపిన పాలను తీసుకోవడం వలన ఈ సీజన్లో వచ్చే జలుబు, కఫం, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది.
అలాగే ఈ మధ్యకాలంలో మనలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఈ పాలను తాగితే ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఎముకలు, కీళ్లు, కండరాలు, దంతాలు మరియు చిగుళ్ళను బలపరుస్తుంది. శారీరక బలహీనతను తగ్గించడానికి చాలా బాగా సహాయపడి శరీరానికి అంతర్గత బలాన్ని అందిస్తుంది
జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. అజీర్ణం., మలబద్ధకం, గ్యాస్ కడుపుబ్బరం వంటి అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఈ పాలను తీసుకోవడం వలన రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.