Matar Paneer Curry:ధాబా స్టైల్ మటర్ పనీర్ మసాలా ఇలా చేస్తే అందరూ వావ్ అంటారు
Matar Paneer Curry:ధాబా స్టైల్ మటర్ పనీర్ మసాలా ఇలా చేస్తే అందరూ వావ్ అంటారు.. పనీర్ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో ఒకసారైన పనీర్ తింటే మంచిది. రకరకాలుగా చేసుకుంటే బోర్ కొట్టకుండా తినవచ్చు.
మటర్ పన్నీర్.. వెజ్ టేరియన్స్ కోసం చేసుకునే స్పెషల్స్ లో పన్నీర్ ఫస్ట్ ఉంటుంది. టేస్టీ అండ్ హెల్తీ పనీర్ స్పెషల్స్ అంటే అందరు ఇష్టపడుతుంటారు. మటర్ పన్నీర్ ఎప్పుడైనా ట్రై చేసారా లేదంటే ఇలా చేసేయండి.
కావాల్సిన పదార్ధాలు
పన్నీర్ – 1 కప్పు
పచ్చి బఠానీలు – 1 కప్పు
ఉల్లిపాయలు – 1 కప్పు
పచ్చిమిర్చి – 2
టమాటో పేస్ట్ – ½ కప్పు
మిరియాల పొడి – 2 టీ స్పూన్స్
ధనియాల పొడి – 2 టీ స్పూన్స్
జీలకర్ర పొడి – 1 టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 ½ టీస్పూన్
గరం మసాలా – ½ టీ స్పూన్
ఉప్పు – 2 టీ స్పూన్స్
తయారీ విధానం
1.ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి పన్నీర్ ముక్కలను వేపి పక్కన పెట్టుకోవాలి.లేదంటే వేపుకోకుండా కూడ చేసుకోవచ్చు.
2. అదే ప్యాన్ ఆయిల్ వేసి తరిగిన ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి.
3.అందులోకి పచ్చిమిర్చి వేసి వేపుతూ ఉల్లిపాయల మెత్తపడ్డాక పసుపు. అల్లంవెల్లుల్లి పేస్ట్ వేగాక పచ్చిబఠానీలు వేసి వేపుకోవాలి.
4.మూతవేసి నాలుగు ,ఐదు నిమిషాలు ఉడికించాలి.
5.ఇప్పుడు అందులోకి టమాటో పేస్ట్ వేసి నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి.
6.ఉడుకుతున్న టమాటోలోకి కారం,ధనియాలపొడి,ఉప్పు,జీలకర్రపొడి,ఉప్పు వేసి కప్పు నీళ్లను వేసి కలిపుకోని పన్నీర్ ముక్కలను జోడించాలి.
7.గ్రేవి చిక్క పడే వరకు పన్నీర్ ని ఉడికించుకవాలి.
8.ఇప్పుడు అందులోకి గరం మసాలా వేసి తరగిన కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకోని సర్వ్ చేసుకోవడమే.