Beauty Tips

Multani Mitti:ముల్తానీ మిట్టిని ఇలా వాడితే.. పార్లర్ కు వెళ్లాల్సిన పనేం లేదు..!

Multani Mitti:ముల్తానీ మిట్టిని ఇలా వాడితే.. పార్లర్ కు వెళ్లాల్సిన పనేం లేదు.. ఈ మధ్య కాలంలో ముఖం మీద ప్రతి ఒక్కరికి శ్రద్ద పెరిగింది. ఇంటి చిట్కాలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు.

ఒకప్పుడు Multani Mitti చాలా అరుదుగా లభించేది. కానీ ఇప్పుడు చాలా విరివిగా లభ్యం అవుతుంది. ముఖం తెల్లగా కాంతివంతంగా మారాలంటే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.

ముఖాన్ని అందంగా కాంతివంతంగా మార్చడంలో ముల్తానీ మట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మం మృదువుగా మారటమే కాకుండా చర్మంలో తేమ ఉండేలా చేస్తుంది. అయితే ఏ చర్మ సమస్య కు ఎలా వాడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కాంతివంతమైన చర్మం కోసం ప్యాక్ ఈ విధంగా తయారు చేసుకోవాలి ఒక బౌల్ లో మూడు స్పూన్ల ముల్తానీ మట్టి ఒక స్పూన్ పెరుగు ఒక స్పూన్ కీర దోశ గుజ్జు 2 స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ పాలు వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది

బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గాలంటే 2 స్పూన్ల ముల్తానీ మట్టి ఒక స్పూన్ పెరుగు ఒక స్పూన్ నిమ్మరసం చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

ఇప్పుడు చెప్పిన చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి పలితాన్ని ఇస్తాయి. చాలా తక్కువ ఖర్చుతో ముఖం మీద ఎటువంటి సమస్యలు లేకుండా తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.