Beauty Tips

Dark Knees And elbows:నల్లగా ఉన్న మోచేతులు, మోకాళ్లు తెల్లగా కావాలంటే ఇలా చేయండి

Dark Knees And elbows:నల్లగా ఉన్న మోచేతులు, మోకాళ్లు తెల్లగా కావాలంటే ఇలా చేయండి.. ముఖం మరియు శరీరం అంతా తెల్లగా ఉండి మోకాళ్ళు, మోచేతుల మీద నలుపు ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.

ఆ నలుపును తగ్గించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన పెద్దగా ఫలితాన్ని ఇవ్వక ఎంతో నిరాశకు గురి అవుతూ ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కా ఫాలో అయితే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఈ చిట్కా కోసం ఒక బౌల్ లో ఒక షాంపూ పేకెట్ లో షాంపూను వేయాలి. దానిలో అరచెక్క నిమ్మరసం, రెండు స్పూన్ల టమోటా రసం, పావు స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్లు, మోచేతులపై నలుపు ఉన్న ప్రదేశంలో రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా నలుపు తగ్గి మృదువుగా మారతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. టమోటా,నిమ్మలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు నలుపును తగ్గించటానికి సహాయపడతాయి. ఆర్గానిక్ పసుపు వాడితే మంచిది. షాంపూ ఏ కంపెనీ అయిన పర్వాలేదు. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం తప్పనిసరిగా వస్తుంది.

ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. పెద్దగా ఖర్చు పెట్టకుండా మంచి పలితాన్ని పొందవచ్చు. ప్రతి చిన్న విషయానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు.

మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే అన్ని వస్తువులు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి. వాటి గురించి తెలుసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అయ్యి మోకాళ్ళు, మోచేతుల మీద ఉన్న నలుపును తొలగించుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.