Kitchenvantalu

Plastic Utensils: ప్లాస్టిక్ పాత్రలపై మరకలు ఈ చిట్కాలతో సులభంగా పోతాయి..

Plastic Utensils:ప్లాస్టిక్ వస్తువులు మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి. మనం ఇంట్లో వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులను వాడుతుంటాం. అవి పగిలిపోయే వరకు వాడటం సహజం. కానీ ప్లాస్టిక్‌ను అతిగా వాడకూడదని మనకు తెలుసు. అయినా భూమిలో త్వరగా కరిగే ఉత్తమ నాణ్యత గల ప్లాస్టిక్‌లు కూడా ఉన్నాయి. వాటిని వాడవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పడటం సాధారణం. కానీ వాటిని తొలగించడం కష్టం. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలతో మనం ఆ మరకలను చాలా సులభంగా తొలగించుకోవచ్చు. వాటిని ఇప్పుడు చూసేద్దాం.

కరోనా వైరస్ రాకతో అనేకమంది హ్యాండ్ శానిటైజర్లను వాడుతూ ఉన్నారు. ఇవి వాడటం చాలా మంచిది. కానీ ఈ శానిటైజర్లను వాడి ప్లాస్టిక్ పైన పడిన మరకలను సులభంగా తీసేయవచ్చు. శానిటైజర్ కలిపిన వేడి నీటిలో ఒక గంట పాటు ముంచి ఉంచితే, ఆ తర్వాత సబ్బుతో బాగా రుద్దితే, ప్లాస్టిక్ పైన పడిన మరకలు తేలికగా పోతాయి.

ప్లాస్టిక్ పాత్రలపై పడిన మరకలను ఉప్పు మరియు నిమ్మరసం ఉపయోగించి సులభంగా తొలగించవచ్చు. మొదట మరకలున్న చోట ఉప్పు చల్లి, తర్వాత స్క్రబ్ చేయాలి. కడిగాక నిమ్మరసంతో బాగా రుద్ది, దాన్ని సుమారు అరగంట పక్కన ఉంచాలి. ఈ ప్రక్రియ ద్వారా మరకలు తొలగిపోతాయి. ఎందుకంటే నిమ్మరసం సహజ బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేసి మరకలను తొలగిస్తుంది.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ