Kitchenvantalu

Restaurant Style Veg Kurma: చపాతీ బిర్యానీలోకి అదిరిపోయే రెస్టారెంట్ స్టైల్ వెజ్ కుర్మా..

Restaurant Style Veg Kurma: సరదాగా బయటకు వెళ్లి రెస్టారెంట్లు, హోటల్లలో వివిధ రకాల ఆహారాలను ఆస్వాదిస్తూ ఉంటారు. అక్కడ వారు విభిన్న రుచుల ఆహారాలను తయారు చేస్తారు. కానీ తరచుగా బయట ఆహారం తినడం ఆరోగ్యానికి హానికరం.కేవలం కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించి మనం ఇంట్లోనే వెజ్ కూర్మా కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు.

ఈ వెజ్ కూర్మ కర్రీ తయారీకి ఎక్కువ సమయం పట్టినా చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడి తినేస్తారు. మరి ఈ వెజ్ కూర్మ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. అవసరమైన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూస్తాము.

వెజ్ కూర్మ కర్రీకి కావాల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, వెజిటేబుల్స్ (మీకు నచ్చినవి), అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, గరం మాసాలా, ఉప్పు, కొత్తిమీర, కొబ్బరి పాలు లేదా పెరుగు, సోంపు గింజలు, నెయ్యి, నూనె.

వెజ్ కూర్మ కర్రీ తయారీ విధానం:
మొదట ఒక మిక్సర్ జార్ తీసుకోండి. దానిలో పచ్చి కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, పచ్చి మిర్చి, జీలకర్ర, ధనియాలు, సోంపు, పసుపు, గరం మసాలా పొడి వేసి మెత్తని పేస్ట్‌గా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కూరగాయలను సుమారు పది నిమిషాలు ఉడికించి వాటిని కూడా పక్కన పెట్టాలి.

ముందుగా స్టవ్ పైన కర్రీ పాన్ ఉంచి, దానిలో కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసి వేడిచేయాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలను వేసి, వాటి రంగు మారే వరకు వేపాలి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి, కాసేపు వేగాక టమాటా ముక్కలను వేసి సన్నగా ఉడికించాలి.

ముందుగా తయారు చేసిన పేస్ట్‌ను వేసి, నూనె పైకి తేలే వరకు మధ్యస్థ మంటపై బాగా కలిపి ఉడికించాలి. తరువాత పక్కన ఉంచిన కూరగాయలను కూడా వేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి. ఆ తరువాత కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి.

ఇప్పుడు పెరుగు లేదా కొబ్బరి పాలను కలిపి, ఆ తర్వాత చిన్న మంట మీద సుమారు పావు గంట పాటు కూర ఉడికించాలి. చివరిగా కొత్తిమీర జల్లి, బాగా కలిపితే, రుచికరమైన వెజ్ కూర్మ కర్రీ రెడీ.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ