Ragi Veg Soup: రాగులతో టేస్టీ వెజ్ సూప్.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..
Ragi Veg Soup: రాగులను మనం ఆహారంగా తీసుకుంటాం, ఇవి మిల్లేట్స్‌లో ఒక భాగం. పూర్వకాలం నుండి రాగులను ఆహారంగా వాడుతున్నారు, వీటిలో అనేక పోషకాలు ఉన్నాయి.
రాగి పిండిని వివిధ రకాలుగా వాడుతూ ఉంటాం. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రాగి పిండితో చాలా ఆరోగ్యకరమైన సూప్ తయారు చేయవచ్చు.
కార్న్ ఫ్లోర్ లేదా మైదా పిండితో కంటే రాగి పిండితో చేసిన సూప్ ఆరోగ్యానికి మరియు రుచికి మంచిది. దీనిని తయారు చేయడం కూడా సులభం. ఇప్పుడు ఈ సూప్ తయారీ విధానం మరియు అవసరమైన పదార్థాలు చూద్దాం
కావాల్సిన పదార్థాలు:
రాగి పిండి, వెల్లుల్లి తరుగు, బటర్ లేదా నెయ్యి, ఉల్లిపాయ, మీకు నచ్చిన వెజిటేబుల్స్, ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్, పంచదార.
రాగి వెజ్ సూప్ తయారీ విధానం:
మొదట ఒక బౌల్‌లో రాగి పిండిని కొంచెం నీరు జోడించి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో వెన్న లేదా నెయ్యి వేసి కరిగించాలి. వెన్న కరిగాక వెల్లుల్లి తరుగు వేసి ఒక సారి వేగించాక, ఉల్లిపాయ తరుగు జోడించి కలిపి, తర్వాత క్యారెట్, బీన్స్, మరియు స్వీట్ కార్న్ వేసి, పచ్చి వాసన పోయేవరకు వేగించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి, అవి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
అవి మెత్తగా అయిన తర్వాత, నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి, మరియు పంచదార వేసి బాగా కలిపి, ఆ మిశ్రమాన్ని సుమారు పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి. తర్వాత, ముందుగా కలిపిన రాగి పిండిని జోడించి, అది చిక్కగా అయ్యేవరకు కలిపి, చివరగా కొంచెం వెనిగర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి.. అంతే రుచికరమైన రాగి సూప్ సిద్ధం.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ