Kitchen Hacks: వర్షా కాలంలో బట్టలు దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేస్తే సరి..
Kitchen Hacks: సాధారణంగా వర్షాకాలం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఎండ ఉన్నా సహించగలరు కానీ, వర్షం పడితే బయటకు వెళ్లలేరు. ఇంటి పరిసరాలు గందరగోళంగా మారతాయి.
అనుకున్న పనులు సమయానికి ముగియవు. వర్షం పడితే మహిళలకు ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. బట్టలు తడిసి దుర్వాసన వస్తాయి. ఎంత శుభ్రపరచినా, సరిగ్గా ఆరకపోవడం వల్ల చెడు వాసన వస్తుంది.
దీని వల్ల మళ్లీ ఉతికే పని పడుతుంది. ఇలా ప్రతి ఇంట్లో ఈ సమస్య ఉంటుంది. ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే బెడ్ షీట్లు, టవల్స్, బట్టలు వాసన రాకుండా ఉంటాయి.
బట్టల నుండి దుర్వాసనను తొలగించాలంటే, బట్టలు ఉతకే సమయంలో కర్పూరం పొడిని డిటర్జెంట్‌లో కలిపి వాడండి. వాషింగ్ మెషీన్‌లో కూడా డిటర్జెంట్‌తో పాటు కర్పూరం పొడిని వేయండి. ఇది బట్టలపై ఉండే బ్యాక్టీరియాను మరియు వాసనను తొలగిస్తుంది.
వర్షాకాలంలో బట్టలు ఎండబెట్టడం కొంచెం కష్టం అయినా, గాలి బాగా వీచే చోట వాటిని ఆరబెట్టండి. దాంతో చెడు వాసన ఉండదు. కంఫర్టర్లు వంటివి వాడితే మరింత మంచి సువాసన వస్తుంది. బట్టలు బాగా ఎండబెట్టాలి. వాసన వచ్చిన బట్టలను ఇతర బట్టలతో కలపకుండా వాటిని మళ్ళీ ఉతికితే ఉత్తమం.
బేకింగ్ సోడా మరియు వెనిగర్‌తో బట్టల చెడు వాసనను తగ్గించవచ్చు. బట్టలు ఉతికే సమయంలో బేకింగ్ సోడాను గానీ వెనిగర్‌ను గానీ వాడితే, వాటి నుండి వచ్చే దుర్గంధం తగ్గుతుంది.
వాషింగ్ మెషీన్‌లను వాడే చాలా మంది అందులో బట్టలను ఓవర్‌లోడ్ చేసి ఉతుకుతారు. దీనివల్ల బట్టలపై మురికి సరిగా పోదు. అలాగే వాటి నుండి వాసన వస్తుంది. కావున బట్టలను తక్కువగా వేసి నీటిని సరిపడా వాడితే బట్టలు మంచి సువాసనతో ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ