Mango Leaves : మామిడి ఆకులను అంత తేలిగ్గా తీసుకోవద్దు.. వీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
Mango Leaves:ఆయుర్వేద నిపుణులు మామిడి ఆకులలో ఎన్నో పోషకాలు ఉండి, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెప్పుతున్నారు. మామిడి చెట్టు ఆకులు ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటాయని కూడా పేర్కొన్నారు.
మామిడి ఆకులు ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల వంటి అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగలవని సూచించారు. మామిడి ఆకుల ప్రయోజనాలను మనం ఇక్కడ తెలుసుకుందాం.
మామిడి ఆకులు కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి, శరీరంలో అనవసర కేలరీలను కరిగించి బరువు తగ్గించేలా చేస్తాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించటమే కాకుండా కడుపు ఉబ్బరం, వాపు, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నివారిస్తాయి.
లేత మామిడి ఆకులు మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మధుమేహ రోగులు వాటిని నమిలి తినడం లేదా మామిడి ఆకులను మరిగించి కషాయంగా తాగినప్పుడు మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
మామిడి ఆకులలో మాంగిఫెరిన్ అనే యాంటీ-మైక్రోబయల్ ఏజెంట్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మామిడి ఆకులను నీళ్లలో వేసి ఆ నీరు రాత్రి మొత్తం అలానే ఉంచి ఉదయం వడకట్టి ఖాళీ కడుపుతో తాగితే అది మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
క్యాన్సర్, ఊబకాయం, గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, మరియు కొలెస్ట్రాల్ సమస్యలకు మామిడి ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మామిడి ఆకులు రక్త నాళాలను బలపరచి, రక్తపోటును నియంత్రించగలవు. మామిడి ఆకుల టీ తాగడం లేదా మామిడి ఆకులను మరిగించిన నీటితో స్నానం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు.
మామిడి ఆకులు యాంటీ-కార్సినోజెనిక్ గుణాలతో ఉండి క్యాన్సర్ వంటి రోగాలకు కారణమైన ఫ్రీ రాడికల్స్ నుండి కలిగే హానిని తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి మరియు ఫ్లేవనాయిడ్లు వంటి శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. వీటిని కడుపు పూత చికిత్సలో కూడా వాడుతారు.
మామిడి ఆకులలో ఉన్న ఫ్లేవనాయిడ్లు జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవి జుట్టు నెరిసిపోవడం నుండి రక్షిస్తాయి. అలాగే కొలాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతాయి. మామిడి ఆకులను టీగా మరిగించి లేదా ఎండబెట్టి పొడి రూపంలో కూడా వాడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ