Tollywood Heroine:ఈ స్కూల్ ఫోటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ ని గుర్తు పట్టారా..
Tollywood Heroine Meena:ఈ ఫోటోలో ఉన్న ఓ ప్రముఖ హీరోయిన్‌ని గమనించారా? టీచర్స్ డే నాడు ఈ ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉపాధ్యాయుల గొప్పదనం గురించి ఆమె ప్రశంసలు తెలిపి, వారికి శుభాకాంక్షలు చెప్పింది. బాల నటిగా తన కెరీర్‌ని ప్రారంభించి, నేటికీ మంచి పాత్రలు వస్తే చేస్తుంది. 1990ల దశకంలో తన నటనతో ఇండస్ట్రీని ఊపేసి, అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జగపతి బాబు, శ్రీకాంత్, మోహన్ బాబు, రవితేజ వంటి ప్రముఖ నటుల సరసన నటించిన ఆమె, మీనా అనే నటి. ఈ ఫోటోలో ఆమె ఎక్కడ ఉందంటే, పై వరుసలో ఎడమ నుండి రెండవ అమ్మాయి మీనా. తమిళనాడులో (తల్లి కేరళకు చెందినవారు, తండ్రి ఆంధ్రకు చెందినవారు) జన్మించి, ఆరేళ్ల వయసు నుండి సినిమాల్లో నటించింది.
శివాజీ గణేశన్ నటించిన ‘నెన్జంగల్’ చిత్రంతో బాల నటిగా తన కెరీర్‌ని ఆరంభించి, తర్వాత హీరోయిన్‌గా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో నటించిన ఈ సుందరికి నటనే కాకుండా భరతనాట్యంలో ప్రవీణత ఉంది. అలాగే, ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లో తన గానం పంచుకుంది.
నవయుగం చిత్రంతో హీరోయిన్‌గా మెరిసిన ఈ సుందరి, సీతారామయ్యగారి మనవరాలు చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. వరుస హిట్లతో టాప్ హీరోయిన్ స్థానాన్ని చేరుకుంది. ఆమె తెలుగులో అత్యధికంగా వెంకటేష్‌తో కలిసి నటించింది. వీరిద్దరూ బెస్ట్ ఆన్‌స్క్రీన్ జోడీగా పేరొందారు. వీరిద్దరూ నటించిన చిత్రాలు అన్నీ హిట్లు కొట్టడం విశేషం.
చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం, దృశ్యం, దృశ్యం 2 చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. చిరంజీవితో ముఠామేస్త్రీ, స్నేహం కోసం, బాలకృష్ణతో అశ్వమేథం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, కృష్ణబాబు, నాగార్జునతో ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అల్లరి అల్లుడు చిత్రాల్లో నటించారు. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ వంటి స్టార్లతో ఆడిపాడింది.
హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం ‘రౌడీ బేబీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. కెరీర్ మంచి స్థాయిలో ఉండగా 2009లో బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యా సాగర్‌ను వివాహమాడింది. వీరికి నైనిక అనే పాప ఉంది. ఆమె కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రతిభ చూపింది. 2022లో మీనా భర్త విద్యా సాగర్ అనారోగ్యం వల్ల మరణించారు. ప్రస్తుతం ఆమె తన కూతురుతో ఒంటరిగా జీవిస్తున్నారు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ