Packet Milk Side Effects:ప్యాకెట్ పాలు కొని వాడుతున్నారా… ఈ విషయాలు తెలిస్తే..
Packet Milk:పాల ప్యాకెట్లను ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వాడుతున్నారు.ప్రతి రోజు పాలు వంటింట్లో తప్పనిసరిగా ఉండాల్సిందే,, ఎందుకంటే ఉదయం లేవగానే టీ తాగటం.. రాత్రి పడుకునే ముందు పాలు తాగి పడుకోవటం మనలో చాలా మందికి ఉన్న అలవాటు. చిన్న పిల్లలు కూడా పాలను ఎక్కువగా తాగుతుంటారు.
పాలును రోజులో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తూనే ఉంటారు. మార్కెట్లో పాలు వివిధ రకాల రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. కానీ చిన్న పిల్లలు, పెద్దవారికి ఏ రకమైన పాలు తాగాలో అనేదానిపై చాలామందికి సందేహాలు ఉంటాయి.
సాధారణంగా, ఉదయాన్నే లేవగానే మనం మార్కెట్‌కు వెళ్లి పాల ప్యాకెట్లు కొనడం, వాటిని తాగడం చేయటం మొదలైన పనులు చేస్తుంటాం. అయితే, కొంతమంది గేదె లేదా ఆవు నుండి సేకరించిన స్వచ్ఛమైన పాలను ఉపయోగిస్తారు, మరి కొంత మంది టెట్రా ప్యాక్‌లో అందుబాటులో ఉన్న పాలను తీసుకుంటారు.
గేదె లేదా ఆవు పాలు చాలా ఆరోగ్యానికి మంచిది. ఈ పాలల్లో ఎటువంటి కల్తీ ఉండదు. అవి పాశ్చరైజేషన్ చేయని పాలు. కాబట్టి.. ఆ పాలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి.
అయితే ప్యాకెట్ పాలు టెట్రా ప్యాక్ లో లభించే పాలను పోల్చి చూస్తే ఏ పాలు మంచిది అనే విషయానికి వస్తే టెట్రా ప్యాక్ లో లభించే పాలు సురక్షితం అని చెబుతూ ఉంటారు ఎందుకంటే టెట్రా ప్యాక్ ను అల్ట్రా హై టెంపరేచర్ పద్ధతిలో తయారు చేస్తారు. అంటే ఈ పాలను హై టెంపరేచర్ లో వేడి చేసి చల్లార్చి ప్యాక్ చేస్తారు అలా చేయటం వలన ఆ పాలలో ఉన్న మైక్రోమ్యాక్స్,ప్యాథోజెన్స్ నశిస్తాయి.అందువల్ల ఆ పాలను తాగితే ఎటువంటి సమస్య ఉండదు.
కొంతమంది ప్యాకెట్ పాలను వాడుతూ ఉంటారు. ప్యాకెట్ పాలు ఒక టెంపరేచర్ వద్దనే పాశ్చరైజ్ చేస్తారు. దాని వల్ల.. కేవలం మైక్రో ఆర్గానిజమ్స్ మాత్రమే నశిస్తాయి కానీ.. ప్యాథోజెన్స్ నశించవు. అందుకే.. ప్యాకెట్ పాల లైఫ్ టైమ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.